NewsOrbit
Featured Horoscope దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope  ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.

మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.కుటుంబంలో సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ధననష్టం జరుగుతుంది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. స్త్రీలకు ఉద్యోగ కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలకు అనుకూలం. చేపట్టిన పనులను వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కోపం వల్ల మీరు కోరుకున్న వ్యక్తులు దూరమవుతారు. కుటుంబంలో సమస్యలు. తక్కువ మాట్లాడటం మంచిది. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః నవగ్రహారాధన చేసుకోండి.

 

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.ధనప్రాప్తి కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మానికి, ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఎదుటివారి కష్టానికి సహాయపడతారు. ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటారు. గోసేవ చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి అనుకూలతలు ఏర్పడతాయి. అప్పుల బాధలు తగ్గిపోతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. స్నేహితులను కలుసుకొని ఆనందంగా ఉంటారు. ఏ పనినైనా మిత్రుల సహకారంతో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు, లాభాలు కలుగుతాయి. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు.

రెమిడీః దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.దంపతుల మధ్య విభేదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. దంపతుల మధ్య విభేదాలు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నిర్మొహమాటంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. తప్పుడు పనులు చేసిన వాళ్ళను ప్రోత్సహించడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు  కలుగుతాయి. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తారు, ఆందోళన పడతారు.

రెమిడీః దుర్గా దేవిని ఆరాధించండి.

 

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. చేపట్టిన ప్రతి పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన యోగం కలుగుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ధన యోగం కలుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలు విని కష్టపడి చదువుకుంటారు. స్త్రీలు క్రొత్త పుస్తకాలను చదవడానికి ఆసక్తి చూపుతారు. ఎదుటి వారికి సహాయ సహకారాలు చేస్తారు.

రెమిడీః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

today february 25 daily horoscope in telugu
today february 25 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.మనోవేదనకు గురవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. మనోవేదనకు గురవుతారు. తప్పని పరిస్థితుల్లో తప్పులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులను అర్థం చేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం వల్ల నష్టాలు ఏర్పడతాయి. వస్తువులు అమ్మడం కొనడం అనుకూలించవు. విద్యార్థులు విద్య మీద అశ్రద్ధ చూపుతారు.

రెమిడీః షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న గొడవలు, చికాకులు తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడకుండా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇతరులకు సహాయం చేయాలని తపన పడతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీః లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఆదాయం తక్కువగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ధననష్టం కలుగుతుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. క్రొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడం వల్ల ఆర్ధిక నష్టం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. అనేక రకమైన సమస్యలు ఏర్పడటం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీః మరకత లక్ష్మీ గణపతిని ఆరాధించండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి 21 ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించండి.

 

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.ఆనందంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఎదుటి వారి తప్పులను సరిదిద్దుతారు. అందరితో ఆనందంగా, సఖ్యతగా ఉంటారు. గతంలో విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకుంటారు. అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు .ముఖ్యమైన విషయాలను బయటకి చెప్పడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. నిజాయితీకి, ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. ఎంత కష్టమైన పనినైనా చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన మంచి అవకాశాలను అందుకుంటారు. వ్యాపారాలను విస్తరించు కుంటారు.

రెమిడీః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

ధనుస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.స్నేహితుల వల్ల సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. మనసులో ఉన్న విషయాలను బయటకి చెప్పక మీలో మీరే ఏదో ఆందోళన పడుతూ మానసిక వేదనకు గురవుతారు. తప్పులు చేయకపోయినా మీ మీద నిందలు పడతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఎదుటి వారిని బాగా నమ్మడం వల్ల నమ్మక ద్రోహం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. స్నేహితులతో అతిగా మాట్లాడటం వల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువులో అశ్రద్ధ చేయడంవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఇబ్బందులు.

రెమిడీః సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.తల్లిదండ్రుల సూచనలను పాటిస్తారు !

ఈరోజు బాగుంటుంది. ప్రాణ స్నేహితులను కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మీలో దైవభక్తి పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. ఎదుటివారు ఎంత కష్టమైన పనిలో అయిన ప్రోత్సహిస్తారు. రాబోయే రోజుల గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దవారిని గౌరవిస్తారు. తల్లిదండ్రుల మాటలను, సూచనలను పాటిస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజ సేవ చేయడానికి ప్రాధాన్యత చూపుతారు.

రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.మొండితనం వల్ల ఇబ్బందులు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న మొండితనం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో మాట పట్టింపులు వల్ల సమస్యలు. తొందరగా డబ్బు సంపాదించాలని తప్పుడు పనులు చేయడంవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సరైన సమయానికి పూర్తి కాకపోవడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. మీలో ఉన్న కోపం వల్ల, గర్వం వల్ల సమస్యలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ధననష్టం కలుగుతుంది. వాహన ప్రయాణాల్లో శ్రద్ధ వహించక పోవడం వల్ల అనర్ధాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.

రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.కార్యాలయాల్లో హోదాలను పొందుతారు !

‌ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. చాలా రకాల సమస్యలకు పరిష్కారాలు వెతుకుతారు. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి మాటలను సూచనలను పాటిస్తారు. ఇంతకు ముందు ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప హోదాలను పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి.  విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

‌రెమిడీః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N