NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : షర్మిల ఆంధ్రను కాదని తెలంగాణలో ఎందుకు తేలింది?అన్న..పెదనాన్నల రాజకీయంలో ఆమె ఓ పాచికేనా??

YS Sharmila : ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. అయితే పోయిన చోట చీకటి ఉంది కదా అని వెలుగు ఉన్న చోట వెతికితే లభిస్తుందా? వైఎస్ఆర్‌సిపి స్థాపనలో, ఆంధ్రలో ఆ పార్టీ అధికారంలోకి రావడంలో షర్మిల కృషిని ఆ పార్టీ మరిచిపోయినా ప్రజలు మరువలేరు. అయితే జగన్ చెల్లెలికి ప్రాధాన్య మివ్వటంలేదన్నది నిజమైతే ఆంధ్రలోనే మరో పార్టీ పెట్టి పోరాడమే ఆమెకు సముచితం.

Why did it turn out in Telangana that YS Sharmila was not from Andhra?
Why did it turn out in Telangana that YS Sharmila was not from Andhra?

పోయిందనుకుంటున్న ప్రాధాన్యం లభించడంతో పాటు అదృష్టం బాగుంటే తొలి మహిళా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. మరి అవసరంలేని చోట, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని రుజువైన తర్వాత కూడా తెలంగాణలో షర్మిల రాజకీయ అరంగేట్రం చేయాలనుకోవడమేమిటి? ఈ పరిణామంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎవరో వెనుక ఉండి ఆడిస్తున్న రాజకీయమని పరిశీలకులు భావిస్తున్నారు. వారెవరు? దానికి కారణాలేమిటి?

YS Sharmila : బీజేపీ దూకుడుకు కళ్లెం?

తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, బీజేపీ రూపంలో టిఆర్ఎస్‌కు పొంచి ఉన్న ముప్పుతో పాటు మతపరమైన అంశాలు కూడా తోడవుతున్నాయనిపిస్తోంది. ప్రజలకు దూరమవుతున్న టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతున్న విషయాన్ని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలు నిరూపించాయి. బిజెపి రాష్ట్ర విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీని ప్రజలకు చేరువ చేస్తున్నారు.సంజయ్ పార్టీని సరైన దిశలో నడిపిస్తూ ప్రత్యామ్నాయం తామేనని రుజువు చేస్తున్నారు. మరి షర్మిల పార్టీకి ఇక్కడ చోటు ఎలా లభిస్తుందనుకుంటున్నారు?టిఆర్ఎస్ విషయానికి వస్తే ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి సంక్షోభాలు గతంలో కూడా ఆ పార్టీ ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ ముందుచూపుతో, మాయమాటలతో ప్రజలను నమ్మించి అధికారం చేజారకుండా చూసుకోగలిగినా, ప్రస్తుతం ఆ పార్టీలోని అంతర్గత సంక్షోభాలే దాని కొంప ముంచేలా కనిపిస్తున్నాయి.ఇక్కడే కేసీఆర్ తన రాజకీయ చాణక్యం ప్రదర్శించారని టాక్

నో డౌట్ !ఇది కెసిఆర్ పాచికే!

గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లోని కీలక నాయకుల ద్వారా ఆ పార్టీ సారథ్యంలోని కూటమిలో టిడిపి చేరే విధంగా కేసీఆర్ రాజకీయ చతురతను ప్రదర్శించి తన అధికారాన్ని నిలబెట్టుకున్నారని వాదనలు వినిపించాయి. అప్పట్లో మరోసారి ఆంధ్రుల పాలన మనకవసరమా? అని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. సరిగ్గా అలాంటి పాచికనే మరోసారి వాడడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో చేతులు కలిపి ఇక్కడ షర్మిలను రాజకీయరంగప్రవేశం చేసేలా కేసీఆర్ పన్నాగం పన్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.మరో కారణం కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో బిజెపి బలంగా ఎదుగుతోంది. ప్రజలు బిజెపి వైపు మళ్ళకుండా చీలిక తీసుకురావడం, తెలంగాణలో నివసించే ఆంధ్ర ప్రాంతం వారు ఆ పార్టీ వైపు మళ్ళకుండా చేయడంతో పాటు వారిలో చీలిక తీసుకురావడం కూడా కేసీఆర్ లక్ష్యం అంటున్నారు. ఇందులో భాగంగానే షర్మిల ప్రవేశమని పలువురు విశ్వసిస్తున్నారు. షర్మిల ద్వారా తన అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు బిజెపి అధికారంలోకి రాకుండా నిలువరించవచ్చని కేసీఆర్ అంచనా వేసి ఉంటారు. తెలంగాణలో బిజెపి ఓడిపోతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పార్టీని దెబ్బకొట్టి తన అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని జగన్ కూడా ఆలోచించి ఉంటారు.

క్రిస్టియన్ మిషనరీల పాత్ర ఉందా?

ఇక హిందుత్వ భావజాల సంస్థలు మరో వాదనను లేవదీస్తున్నాయి. తెలంగాణలో షర్మిల ప్రవేశాన్ని ఈ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలను హిందువులు సహించలేకపోతున్నారు. జగన్ పాలనలో దేవాలయాలపై దాడులు, మతమార్పిడులు పెరిగాయి. దేవాలయాల్లోని విగ్రహాల విధ్వంసానికి తానే కారణమని ఒక పాస్టర్ బహిరంగంగా ప్రకటించాడంటే అక్కడి పరిస్థితిని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్‌తో పాటు బిజెపి, బజరంగ్‌దళ్ తదితర హిందుత్వ సంస్థలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వానికి సన్నిహితుడైన ఒక మఠాధిపతి నోరు మెదపకపోవడం కూడా హిందువుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ఆంధ్రలో వలే తెలంగాణలో కూడా తమ మతవ్యాప్తి కార్యక్రమాలు విస్తరించడానికి క్రిస్టియన్ మతసంస్థలే షర్మిలను పంపించి ఉంటాయంటున్నారు.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N