Prabhas : ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియన్ స్టార్ గా ఎంతటి క్రేజ్ దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు ప్రభాస్ తో తీసే సినిమాల బడ్జెట్ కూడా ఊహించలేనంతగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే నిర్మాత కనీసం 300 కోట్ల నుంచి 400 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించాల్సిందే అన్నది ఇండస్ట్రీ వర్గాలలోని సినీ ప్రముఖుల మాట. సాహో సినిమా తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ ఎంతగా పెరిగిందో తెలిసిందే.
ప్రస్తుతం మన డార్లింగ్ ప్రభాస్ చేతిలో 4 పాన్ ఇండియన్ సినిమాలున్నాయి. ఇప్పటికే రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అన్న పీరియాడికల్ రొమాంటిక్ సినిమా చేస్తున్న ప్రభాస్ దాదాపు ఈ సినిమాని కంప్లీట్ చేశాడు. జూలై 30 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సలార్ అన్న సినిమాతో రాబోతున్నాడు ప్రభాస్. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Prabhas : ప్రభాస్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ నిజంగా 100 కోట్లా ..?
అలాగే బాలీవుడ్ దర్శకుడితో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇలా ప్రభాస్ చేతిలో ఉన్నవన్ని పాన్ ఇండియన్ సినిమాలే కావడం తో ఆయన రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో ఉందని అంటున్నారు. ఒక్కో సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే నాని లాంటి హీరోతో మీడియం బడ్జెట్ సినిమాలు రెండు నుంచి మూడు సినిమాలు నిర్మించవచ్చని చెప్పుకుంటున్నారు. నాని, శర్వానంద్, అఖిల్ లాంటి హీరోల సినిమాలు 30 నుంచి 35 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి ప్రభాస్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ నిజంగా 100 కోట్లా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.