Today Horoscope మార్చి – 02 – మాఘ మాసం – మంగళవారం.
మేష రాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు !
ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. తగాదాలకు దూరంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. డబ్బు సంపాదించడానికి ప్రాధాన్యత చూపుతారు. చేపట్టిన ప్రతి పనిని తెలివిగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గతంలో గొడవపడ్డ వారితో సఖ్యతగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు. ఉన్న సమస్యలన్నీ తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తు లు కార్యాలయాల్లో పై అధికారులచే కీర్తింప పడతారు.
రెమిడీ: ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.
వృషభ రాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.అప్పుల బాధలు పెరుగుతాయి !
ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి అవ్వక వాయిదా పడతాయి. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల వివాదాలు, మనస్పర్ధలు ఎదురవుతాయి. మీకు సహాయం చేసేవారు దూరం అవుతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ధననష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపించడం వల్ల వివాదాలు. చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవుతాయి. తొందరపాటు తనం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.
రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోండి.
మిధున రాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.పోటీ పరీక్షల్లో విజయం !
ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఏ పనిలో అయినా మీరు చేసే సాహసం వల్ల అన్ని పనులు ఆటంకాలు లేకుండా సమయానికి పూర్తవుతాయి. ప్రశాంతంగా ఉంటారు. మనో ధైర్యం పెరుగుతుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. వివాహ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనుకూలిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణబాధలు తగ్గిపోతాయి. ధనయోగం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు.
రెమిడీ: మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.
కర్కాటక రాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.అనవసర ఖర్చులు వల్ల ఇబ్బందులు !
ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రుణబాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. మాటపట్టింపులు వల్ల, మొండితనం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు ఎదురవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు ప్రాధాన్యతనిచ్చి చదువును నిర్లక్ష్యం చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని వత్తిడి.
రెమిడీ: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.
సింహరాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.తీర్థయాత్రలు చేస్తారు !
ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీలో ఉన్న మానసిక వేదన తగ్గుతుంది. ప్రశాంతం గా ఉంటారు. చేపట్టిన పనులన్నీ సరైన సమయానికి పూర్తిచేస్తారు. చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు. ఎదుటివారిని మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ధనలాభం కలుగుతుంది. ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు.
రెమిడీ: ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.
కన్యారాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !
ఈరోజు ప్రయోజనకరంగా లేదు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. అవసరానికి డబ్బులు అందక పోవడం వల్ల ఇబ్బందులు. మీరంటే ఇష్టపడేవారు దూరం అవుతారు. మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల ధనం వృధా అవుతుంది. ఏమైనా వస్తువులు అమ్మడం కొనడం వల్ల నష్టం కలుగుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. ప్రశాంతత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీ: ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.
తులారాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.శుభవార్తలు వింటారు !
ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఇంతకు ముందు కంటే ఆర్థికలాభం మెరుగుపడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకులం. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులం బాగా కష్టపడి చదువుకుంటారు.
రెమిడీ: శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి.
వృశ్చిక రాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.రుణ బాధలు !
ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. రుణ బాధలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలు కాకపోవడం వల్ల ఆర్ధిక నష్టం జరుగుతుంది. ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టం కలుగుతుంది. సమయానికి నిద్ర హారాలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోడం వల్ల నష్టం ఏర్పడుతుంది.
రెమిడీ: ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి.
ధనుస్సు రాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి !
ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తిచేస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణ లాభం కలుగుతుంది. పౌష్టిక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి శ్రద్ధ చూపుతారు. గతంలో విడిపోయిన స్నేహితులను తిరిగే కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు అనుకూలిస్తాయి.వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి.
రెమిడీ: ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.
మకర రాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.చేపట్టిన పనులు వాయిదా పడతాయి !
ఈరోజు అనుకూలంగా లేదు. మనోవేదనకు గురవుతారు. పెద్ద వారితో సఖ్యత లోపించి చిరాకు పడతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగా మీలో ఉన్న నిరుత్సాహం వల్ల వాయిదా పడతాయి. అనవసర ఖర్చులు పెరగడం వల్ల ధననష్టం కలుగుతుంది. ప్రయాణల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అనవసరపు విషయాలను ఇతరులతో చర్చించడం వల్ల వాదోపవాదాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది.
రెమిడీ: ఈరోజు శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర పారాయణం చేసుకోండి.
కుంభరాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !
ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుంటారు. క్రొత్త క్రొత్త పుస్తకాలు చదవడానికి శ్రద్ధ చూపుతారు. కుటుంబంలో సమస్యలు సమసిపోతాయి. అందరితో కలిసి మెలిసి ఉంటారు. డబ్బులను పొడుపు చేయడానికి ఆసక్తి చూపుతారు. ప్రయాణ లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. వస్తు లాభం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉన్నత కళాశాలల్లో సీట్లు పొందుతారు.
రెమిడీ: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.
మీన రాశి Today Horoscope మార్చి- 2 – మాఘమాసం – మంగళవారం.ధననష్టం !
ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న కోపం వల్ల సమస్యలు ఎదురవుతాయి. మానసిక వేదనకు గురవుతారు. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ధననష్టం జరుగుతుంది. చేపట్టిన పనులను శ్రద్ధ పెట్టి చేయకపోవడం వల్ల సరైన సమయానికి పూర్తి చేయలేక పోతారు. చేసే పనిలో ఆటంకాలు ఏదురవుతాయి.
రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.