Sharwanandh : ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేస్తూ.. విలక్షణ పాత్రలతో అందరినీ అలరిస్తూ ఉంటాడు శర్వానంద్.. ఈరోజు హీరో శర్వానంద్ పుట్టినరోజు.. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితుడు రామ్ చరణ్ స్వయంగా శర్వా చేత కేక్ కటింగ్ చేయించారు.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు..ఇక ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం శ్రీకారం, మహాసముద్రం అనే చిత్రాలలో బిజీగా ఉన్నారు.. శ్రీకారం మూవీ ట్రైలర్ రీసెంట్ గా విడుదల కాక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మల్టీస్టారర్ మూవీ మహా సముద్రం నుంచి శర్వానంద్ లుక్ ను విడుదల చేశారు..
తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రీకరణ త్వరలోనే ప్రారంభిస్తున్నామని శర్వా టీం తెలిపారు.. ఈ సినిమా కథ కంటెంట్ పై శర్వానంద్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.. మార్చి 11వ తేదీన శ్రీకారం సినిమా విడుదల కానుంది..