NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP : తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ…ఎవరంటే..

YSRCP : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీ ఎన్నికల  నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్నది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు ఈసీ షెడ్యుల్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది.

YSRCP  announced Tirupati by poll candidate
YSRCP announced Tirupati by poll candidate

వైసీపీ తిరుపతి ఎంపి అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.

YSRCP  announced Tirupati by poll candidate
YSRCP announced Tirupati by poll candidate

తిరుపతి వైసీపీ ఎంపిగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ కరోనా బారిన పడి మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక జరుగుతోంది. తొలుత ఈ ఉప ఎన్నికకు అభ్యర్థిగా బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు లేదా భార్యకు ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు భావించారు. అయితే జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో ఫిజియోథెరఫీ సేవలు అందించిన డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా వైసీపీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కల్యాణ చక్రవర్తికి జగన్ గతంలోనే  ఎమ్మెల్సీ ఇస్తామని హమీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో చక్రవర్తికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థిగా గురుమూర్తిని ఖరారు చేస్తూ వైసీపీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

కాగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ..తమ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసింది. తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. ఇక బీజెపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇటీవల కాలం వరకూ తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన పోటీ చేయాలని భావించింది. అయితే రెండు రోజుల క్రితం జనసేన తమ ప్రతిపాదనను విరమించుకున్నది. ఉమ్మడి అభ్యర్థిగా బీజెపీ నేతను ఎన్నికల బరిలో నిలుపుతామని ప్రకటించారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఒకరిని బీజేపీ అభ్యర్థిగా నిలిపే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడో రేపో బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju