NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Main Released Movies In OTT: ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కి వచ్చి మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకున్నాయి. గామి, ఓం భీమ్ బుష్ నుంచి టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ వరకు ఏప్రిల్ లో ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి ప్రేక్షక ఆధారమే దక్కించుకుంది. అయితే మేలో తెలుగు చిత్రాలు పెద్దగా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఏప్రిల్ లో ఫ్యామిలీ స్టార్ మినహా థియేటర్లలో పాపులర్ సినిమాలు అన్నీ రిలీజ్ కాలేదు. అయితే మే నెలలో ఇతర భాషలకు చెందిన కొన్ని పాపులర్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హిరామండి:
బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లేదా బన్సాలి భారీ బడ్జెట్ తో రూపొందించిన ఏ సిరీస్ మేలో ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ సిరీస్ మే 1వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. మనీషా కొయిరాలా, ఆదితి రావ్, మీనాక్షి సిన్హా, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ హిందీ సిరీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సిరీస్ పై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. అదేవిధంగా ఈ సిరీస్ పాన్ ఇండియా బడ్జెట్ తో రూపొందింది.

2. మంజుమ్మల్ బాయ్స్:
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మే నెలలోనే ఓటిటిలోకి రానుంది. మే ఐదవ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో ఈ మూవీ ప్రసారం కానుంది. మలయాళం తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కు రానుంది. మలయాళం లో ఏప్రిల్ 22న ఈ మూవీ రిలీజ్ అయింది. ఇక మలయాళ ఇండస్ట్రీలో రూ. 200 కోట్ల కలెక్షన్స్ను దక్కించుకున్న తొలి సినిమాగా రికార్డ్ సైతం ఈ మూవీ బ్రేక్ చేసింది.

3. సైతాన్:
బాలీవుడ్ సూపర్ నాచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ నే సైతాన్. ఈ చిత్రం మే నెలలోనే నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ మే మూడవ తారీఖున స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రను పోషించిన సైతాన్ మూవీ మార్చ్ 8న థియేటర్లలో విడుదలై మంచి టాక్ అందుకుంది.

4. జర హట్కే జర బచ్కే:
ఈ మూవీ ఎట్టకేలకు మే నెలలో ఓటీటీలోకి రానుంది. జియో సినిమా ఓటిటిలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వస్తుంది. మే మూడో వారంలో ఈ మూవీ జియో సినిమాలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ క్లారిటీ కూడా రానుంది. విక్కీ కౌశాల్, సారా అలీ ఖాన్ హీరో మరియు హీరోయిన్గా నటించిన రొమాంటిక్ కామెడీనే ఈ చిత్రం.

5. ఆవేశం:
మరియాల్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఆవేశం సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్ల మార్క్ను దాటేసింది. ఏప్రిల్ 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ యాక్షన్ కామెడీ చిత్రం ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఆవేశం మూవీ మే 17వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానుంది.

ఇలా తెలుగు సినిమాల కంటే ఎక్కువ శాతం ఇతర భాషలకి చెందిన సినిమాలే మేలో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri