NewsOrbit
న్యూస్ రివ్యూలు సినిమా

Mosagallu Review : ‘మోసగాళ్ళు’ మూవీ ఫస్ట్ హాఫ్ రిపోర్టు

Mosagallu movie Review

Mosagallu Review : మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రంమోసగాళ్లు‘. విష్ణు నే ఈ సినిమాను అత్యంత రిస్క్ తో తన మార్కెట్ పరిధిని మించి నిర్మించడం గమనార్హం. యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి అర్ధ భాగం ఎలా ఉందో చూద్దాం

 

Mosagallu Review first half
Mosagallu Review first half

అసలు ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగింది?

ఒక రియల్ లైఫ్ స్కామ్ ఇన్స్పిరేషన్ తో తెరకెక్కిన ఈ చిత్రం స్టార్టింగ్ లోనే అర్జున్ (విష్ణు). అను (కాజల్) లను అక్క, తమ్ముళ్ళ గా చూపిస్తారు. వీరిద్దరి చిన్నతనం ఎపిసోడ్ చూపించిన తర్వాత హీరో అర్జున్ ఒక నైట్ పార్టీ లో ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక చిన్న ఫైట్ అయిపోయిన తర్వాత కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ గా అర్జున్ ఈ చిత్రంలో కనపడతాడు. అతనికి టాలెంట్, స్కిల్స్ మెండుగా ఉంటాయి. ఇదే సమయంలో అర్జున్ బాస్ అయినా నవదీప్ ఒక స్కామ్ చేయడానికి మాస్టర్ ప్లాన్ చెబుతాడు. దాని తర్వాతే కాజల్, అను  పాత్ర లో అర్జున్ కథలోకి ప్రవేశిస్తుంది. అను వచ్చి ఈ ప్లాన్ తో అర్జున్ నవదీప్ లతో కలిసిపోతుంది. వీరంతా కలిసి అమెరికన్స్ ని టార్గెట్ చేసి ఒక పెద్ద స్కాం వేయాలని ప్రయత్నిస్తారు. అయితే పకడ్బందీగా అంతా ప్లాన్ చేసినప్పటికీ మొట్టమొదటి ప్రయత్నం డిజాస్టర్ అవుతుంది. దీంతో ఇదే సమయంలో అర్జున్ , అను జీవితంలో లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎలాగైనా వీరు చేయాల్సిన పెద్ద స్కామ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ‘విక్టరీవెంకటేష్ వాయిస్ ఓవర్ కథ ను ఇంకా ముందుకు నడిపిస్తుంది. అయితే అవతలి వైపు అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ఈ స్కామ్ ను ఆపడానికి నానా కష్టాలు పడుతున్నాడు. ఈ లోపల ఒక పెద్ద గొడవ జరిగి ట్విస్ట్ తో ఇంటెర్వెల్ ముగుస్తుంది.

Mosagallu Review : ‘మోసగాళ్ళు’ ఫస్ట్ హాఫ్ రిపోర్టు

  • ముఖ్యంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువల గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సంయుక్తంగా నిర్మించారు. నిర్మాత మంచు విష్ణు ఎక్కడా కూడా డబ్బుకి వెనకాడలేదని అర్థం అవుతోంది.
  • గ్లామరస్ హీరోయిన్ కాజల్ మంచు విష్ణు పక్కన అక్క గా చేసింది అంటేనే కథ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. రియల్ స్కామ్ ఇన్స్పిరేషన్ గా తీసిన స్టోరీ కావడంతో కథ బాగా గ్రిప్పింగ్ గా రియాలిటీకి దగ్గరగా చూపిస్తారు.
  • నరేషన్ అన్న విషయంలో దర్శకుడు ఎంతో పరిణితి సాధించినా తెలుగు ప్రేక్షకులలో ఒక వర్గం ఆడియన్స్ కు మాత్రమే ఈ టైప్ సినిమా ఎక్కవచ్చు. ముఖ్యంగా మాస్ సెంటర్స్, బి, సి సెంటర్లలో ఈ సినిమాను లైట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిత్రం సూపర్ హిట్ కావడం అనేది అత్యవసరం.
  • నటీనటుల పెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు బాగానే ఉంది. కథ కూడా మంచి ఫ్లో లో వెళుతోంది. అవసరమైన చోట్ల స్టోరీ ఎలివేట్ అవుతుంది. వెంకటేష్ వాయిస్ మరొక మేజర్ అని చెప్పాలి.
  • ఫస్టాఫ్ లో దాదాపు ఎలాంటి మేజర్ మైనస్ లు కనపడలేదు. ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉన్నప్పటికీ కథకు తగ్గట్టు స్క్రీన్ప్లే సాగుతోంది. అయితే రెండవ భాగం ఎలా ఉంటుంది అన్న విషయం పై సినిమా భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంది.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N