Rahul sipligunj : రాహుల్ సిప్లిగంజ్ హీరో అవుతున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ సింగర్ గా ఎంత ఫేమస్ అయ్యాడో అంతకంటే ఫేమస్ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చాక అయిన సంగతి తెలిసిందే. గత సీజన్ కి కూడా ఎలిమినేట్ అయిన ప్రతీ ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నాడు. అయితే రాహుల్ సిప్లిగంజ్ కి సినిమాలలో అవకాశాలు దక్కుతాయని ఎవరూ అనుకోలేదు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పొషించే అవకాశం అందుకున్నాడు.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ లాంటి వాళ్ళతో కలిసి నటించే అవకాశం అంటే గొప్పే. ఇదొక్క సినిమానే అనుకుంటే ఇప్పుడు ఏకంగా హీరో అయ్యాడు మన రాహుల్ సిప్లిగంజ్. ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయింది. ఆర్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఆయన హీరోగా మల్లిక్ కందుకూరి దర్శకత్వంలో ఈ సినిమాలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ‘చిచ్చా’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. కాగా సినిమా టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు సిద్దిపేటలో లాంచ్ చేశారు.
Rahul sipligunj : ‘చిచ్చా’ టైటిల్ సాంగ్ విడుదల..!
రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితుడు శ్రీకాంత్ తో కలిసి మొదలు పెట్టిన ‘ఊకో కాకా’ (మెన్స్ వేర్) బ్రాండ్ స్టోర్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘చిచ్చా’ టైటిల్ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ అభిమానులు విడుదల చేయడం ఇక్కడ ఆసక్తికరం. రాహుల్ సిప్లిగంజ్ కి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. మరి హీరోగా సెటిలవుతాడా లేదా అన్నది చూడాలి.