NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

KCR : కెసిఆర్ కి సడన్ గా ఉద్యోగులపై ఇంత ప్రేమ ఎందుకు పుట్తుకొచ్చిందబ్బా?

Is this KCR strategy

KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాష్ట్ర ఉద్యోగుల పై వరాల జల్లు కురిపించారు. అయితే రాజకీయ నేతలు ఏమి చేసినా ఊరికనే చేయరే అనే సందేహం అందరి మదిలో మెదులుతుంది. ఏ రకంగా తమకు లబ్ది లేకుండా ఏ నేత అయినా కూడా ఏమి చేయడు అనేది జనాల నరనరాల్లో ఇంకిపోయిన భావన. కాబట్టి నాయకులు స్పందించారు అంటే సొంత లాభం కొంత మానుకున్నారు అనే రకంగా ఎవరూ ఆలోచించరు.

 

Is this KCR strategy
Is this KCR strategy?

అలాంటిది మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా వరాల వర్షం కురిపించారు అంటే ఆ అనుమానాలు తారా స్థాయికి చేరుకోకుండా ఉంటాయా? కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడే ఉద్యోగ వర్గాల ఎన్ని డిమాండ్ చేసిన పట్టించుకోని కేసీఆర్…. ఆర్టీసీ ఉద్యోగుల తో కయ్యానికి కాలు దువ్విన కేసీఆర్ఇప్పుడు అనూహ్యంగా ఇంత మార్పు చెందడం వలన కథాకమామీషు ఏమిటి అన్నది తెలియక చాలా మంది తలలు గోక్కుంటున్నారు. 

30% ఫిట్మెంట్ పెంచారు. ఇది ఏప్రిల్ 1 నుండే అమలులోకి వస్తుందని ప్రకటించేశారు. ఈ పిఆర్సి తో 9 లక్షల 15 వేల 797 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. అలాగే రిటైర్మెంట్ పరిమితిని 61 ఏళ్ళ కి పెంచారు. అసలు ప్రతి ఒక్క ఉద్యోగుల సంఘానికి మేలు అయితే చేసేశారు. ఇక దీనికి కారణంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రకి ఎంత ఇచ్చినా తక్కువ అనిఅందుకే అన్ని ఉద్యోగాలకు పిఆర్సి వర్తిస్తుందని కూడా చెప్పేశారు. 

ఇదంతా మానవీయ కోణంలో జరుగుతుందని చెబుతున్నప్పటికీ…. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలోనే ఈ వ్యూహాత్మక ధోరణి అని పలువురు అంటున్నారు. దుబ్బాక షాక్, గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు చేజారడం తర్వాత రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోంది కాబట్టి ఇది చెక్ మేట్ అంటున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించాలి అంటే ఇలాంటి కీలక నిర్ణయాలు తప్పవని కేసీఆర్ భావించినట్లు వేశ్లేషిస్తున్నారు. మరి ఈ విశ్లేషణలు అన్నీ ఇప్పుడు కెసిఆర్ పై ఇలా వార్తల్లా వస్తుంటే దానికి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో ఉపఎన్నిక ఫలితాలు చూస్తే తెలుస్తుంది

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!