Manchu vishnu : మంచు ఫ్యామిలీ హీరోల సినిమాలు ఈ మధ్య రావడం లేదు. సీనియర్ హీరో మోహన్ బాబు సినిమాలు బాగా తగ్గించేశారు. ఎప్పుడో ఒకసారి కథ నచ్చితే ..అందులో ఆయన పాత్రకి మంచి పేరొస్తుందనుకుంటే తప్ప సినిమా ఒప్పుకోవడం లేదు. ఇక ఆయన కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ సినిమాలు వచ్చి దాదాపు రెండేళ్ళ పైనే అయిపోయింది. అయితే ఇద్దరు సొంత బ్యానర్స్ స్థాపించి వరసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు నుంచి మోసగాళ్ళు సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది. మంచు విష్ణు ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్ కీలక పాత్రల్లో కనిపించారు. తెలుగు హిందీ తమిళ కన్నడ భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా వసూళ్ళు కాస్త నెమ్మదించాయి. ఇంకా బ్రేకీవెన్ టార్గెట్ కి చాలా దూరంలోనే ఉంది మోసగాళ్ళు సినిమా. మరి మంచు విష్ణు ఎంతో నమ్మి తీసిన మోసగాళ్ళు ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.
Manchu vishnu : మంచు విష్ణు ఎక్కువ దర్శకులను నమ్మే మోసపోయాడట..!
అయితే మంచు విష్ణు ఎక్కువ దర్శకులను నమ్మే మోసపోయానని తెలిపాడు. తన లైఫ్ లో చాలా మందిని నమ్మి దెబ్బ తిన్నాడట. గుడ్డిగా దర్శకులను నమ్మి కొన్ని సినిమాలు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వెల్లడించాడు. ఇకపై అలా చేయనని చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. కాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మంచు విష్ణు అహం బ్రహ్మాస్మి, మంచు మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమాలతో రాబోతున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!