NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Ration Dealers : ఆదాయం పాయె.. కమీషన్ లేకపాయె..!! ఆందోళన బాటలో డీలర్లు..!

ration dealers fight against ap government

Ration Dealers: ఇంటింటికీ రేషన్ Ration Dealers ఇంటింటికీ రేషన్.. జనవరి నెల నుంచి ఏపీలో ప్రారంభమైన కొత్త వ్యవస్థ. నిజానికి దేశంలోనే ఇటువంటి ప్రయోగానికి ఏపీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం భారీగా వాహనాలు కొనుగోలు చేశారు. రేషన్ కోసం ప్రజలు డిపో వద్దకు వెళ్లకుండా, లైన్లో నుంచోకుండా, శ్రమ లేకుండా ఇంటి వద్దే ప్రభుత్వం అందించే సరుకులు తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే.. ఆలోచనను సక్రమంగానే గాడిలో పెట్టినా ఆచరణలో కొన్ని విమర్శలు తప్పలేదు. ఇదంతా పక్కనపెడితే ఇప్పటివరకూ రేషన్ ఇచ్చిన డీలర్ల పరిస్థితే ఇప్పుడు ఆందోళనలో పడింది. రేషన్ డోర్ డెలివరీ ప్రారంభించకముందు.. మీకేమీ నష్టం చేయం అని ప్రభుత్వం చెప్పింది. కానీ.. డీలర్లకు తమకు అన్యాయం జరుగుతోందనే అంటున్నారు.

ration dealers fight against ap government
ration dealers fight against ap government

తమకు ఇవ్వాల్సిన కమీషన్ ఇవ్వకుండా ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని వారంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. త్వరలో తమ సమస్యలపై హైకోర్టును ఆశ్రయించాలని ఆలోచన చేస్తున్నారట. పీడీఎఫ్ బియ్యం పంపిణీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాలు డీలర్లకు కమిషన్ చెల్లిస్తున్నాయి. ఇవి కాకుండా ఇతర నిత్యావసరాలు అమ్మినప్పుడు మరికొంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఇదంతా పోయింది. రాష్ట్రంలోని దాదాపు 29వేల మంది డీలర్లు మొత్తంగా ఈ మూడు నెలలకు కలిపి దాదాపు 200 కోట్ల నాన్ పీడీఎఫ్ ఆదాయం కోల్పోయినట్టు సమాచారం. ఇది కాకుండా ఆరు నెలల నుంచి ప్రభుత్వం డీలర్లకు చెల్లించాల్సిన 180కోట్ల కమిషన్ కూడా చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో తమ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయించారు.

 

ఇందుకు హైకోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రేషన్ ఇంటింటికీ డెలివరీలో కూడా ప్రజలు వాహనాల వద్దకే వచ్చి లైన్లో నిలబడుతున్నారు. దీంతో ఈ వ్యవస్థపై విమర్శలూ వస్తున్నాయి. ప్రతి ఇంటికీ, ఇరుకు సందుల్లోకి వాహనాలు వెళ్లలేక డోర్ డెలివరీ సాధ్యం కావడం లేదు. అలా కాకుండా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో ప్రారంభించి లోటుపాట్లను గుర్తించి ఉంటే డీలర్ల వ్యవస్థకు ఇబ్బందులు వచ్చేవి కావని చెప్పాలి. ఏదేమైనా ఉన్న వ్యవస్థలోనే కొత్త విధానం ప్రారంభమైంది. కానీ.. పాత వారితో కాదు. మరి.. దశాబ్దాలుగా డిపోలపైనే ఆధారపడిన వారి పరిస్థితి సందిగ్ధంలో పడటం బాధాకరమే..!

 

 

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N