Srinivas Gowda : శ్రీనివాస గౌడ అంటే ఎవరు గుర్తు పెట్టుకోవచ్చు కానీ.. కంబాళ వీరుడు శ్రీనివాస గౌడ అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తాడు.. దున్నలతో పోటీపడుతూ రాకెట్ వేగంతో దూసుకుపోయే కంబాళ పోటీల్లో ఇతగాడు దేశం మెచ్చిన మొనగాడు.. మట్టిలో పుట్టిన పరుగు వీరుడు.. గత సంవత్సరం కంబాళ పోటీల్లో 142.4 మీటర్ల దూరాన్ని కేవలం 13.42 సెకన్లలో పూర్తి చేశాడు.. అంటే 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేసినట్టు లెక్క.. తాజాగా జరిగిన పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలో పూర్తి చేసి తన రికార్డును తానే తిరగరాసాడు..
శ్రీనివాస గౌడ గత సంవత్సరం జరిగిన పోటీల్లో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల ప్రపంచ రికార్డు 9.58 సెకన్లు బ్రేక్ చేయగా.. తాజాగా జరిగిన పోటీల్లో ఊహకి అందని స్పీడ్ 100 మీటర్ల పరుగు పూర్తి చేసి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల కర్ణాటక లోని బంత్వాల్ తాలూకా పరిధిలో నిర్వహించిన 125 మీటర్ల పరుగు పోటీల్లో పాల్గొన్న శ్రీనివాస గౌడ 11.21 సెకండ్లలో టార్గెట్ ఛేదించాడు.. ఈ పోటీని 100 మీటర్లకు లెక్కకడితే అతడు లక్ష్యాన్ని కేవలం 8.78 సెకన్లలో పూర్తి చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.. గత వారం వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబాళ పోటీలో 100 మీటర్ల రేసులో 8.96 సెకండ్స్ లో పూర్తి చేసిన శ్రీనివాస్.. వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలుకొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు.. శ్రీనివాస్ గౌడ పరుగు కి యావత్ భారతదేశం సలాం చేస్తోంది..
Kambala Jockey Srinivas Gowda, who was named Usain Bolt of India last year by covering a 100-meter buffalo racing track in 9.55 seconds, sets a new record
This time he covered 100-meters in just 8.96 seconds and broke his own record.
Hats Off To His Talent ? pic.twitter.com/WnAbpb76o4— rubina khatun (@rubinak79265448) March 23, 2021