NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna : బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మీ..!

Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణకి జంటగా కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా బాలయ్య అఖండలో రెండు వైవిధ్య భరీతమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి రైతు పాత్ర అయితే మరొకటి అఘోర పాత్ర.

varalakshmi in balakrishna-movie
varalakshmi in balakrishna-movie

ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య పాత్రలకి సంబంధించిన రెండు లుక్‌లు రిలీజై అభిమానులతో పాటు ప్రేక్షకులలోనూ అంచనాలు భారీగా పెంచాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 28న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా మొదలవనుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

Balakrishna : బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మీకి అవకాశం ఇవ్వబోతున్నారట.

అయితే మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మీకి అవకాశం ఇవ్వబోతున్నారట. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్రకి బాగా ఆదరణ లభించింది. అలాగే అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలో లాయర్‌గాను వరలక్ష్మీకి చాలా మంచి పేరు వచ్చింది. దాంతో టాలీవుడ్ లో వరలక్ష్మీకి బాగా పాపులారిటీ పెరిగింది. ఈ క్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ను దృష్టిలో పెట్టుకొని ఒక పాత్రను డిజైన్ చేశాడట గోపీచంద్ మలినేని. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ వస్తుందని సమాచారం.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?