NewsOrbit
Featured న్యూస్

West Bengal: భర్తకు వ్యతిరేకంగా భార్య ప్రచారం!బెంగాల్ ఎన్నికల్లో ఓ విచిత్రం!!

West Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కలియాగంజ్ బీజేపీ అభ్యర్థి సౌమిన్ రాయ్​పై ఆయన భార్య శర్బరీ సింఘా రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు ఓటేయొద్దని, అతని క్యారెక్టర్​ మంచిది కాదని మీడియా సమక్షంలో కలియాగంజ్ ప్రజలను కోరారు శర్బరీ.

Wife campaigning against husband! Strange in West Bengal elections !!
Wife campaigning against husband! Strange in West Bengal elections !!

West Bengal: ఇదీ నా భర్త నీచ చరిత్ర!

యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి.. వారి నుంచి చాలా డబ్బు దోచుకున్నాడు సౌమిన్. సౌమిన్ కు వేరొక మహిళతో అక్రమసంబంధం ఉంది. నన్ను, నా కూతుర్ని మోసం చేసి వేరే కాపురం పెట్టాడు. దయచేసి అతనికి ఓటేయొద్దు. ప్రజాప్రతినిధి అయ్యే అర్హత అతనికి లేదు అని శర్బరీ సింఘా రాయ్ మీడియా సమక్షంలో తెలిపారు. సౌమిన్ అక్రమాస్తుల వివరాలను కూడా ఆమె బయటపెట్టారు. కలియాగంజ్​ అభ్యర్థిగా సౌమిన్​ను తొలగించాలని తాను.. రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులను కోరినట్లు శర్బరీ తెలిపారు. అయితే, తన వ్యాఖ్యలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు.ఏ పార్టీకీ తాను మద్దతుగా మాట్లాడటం లేదని..సౌమిన్​కు వ్యతిరేకంగా ప్రచారం మాత్రం నిర్వహిస్తానని శర్బరీ స్పష్టం చేశారు.

పార్టీ కేడర్లో కూడా వ్యతిరేకత!

కలియాగంజ్​ భాజపా అభ్యర్థిగా సౌమిన్​ రాయ్​ పేరును ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత ఏర్పడింది. సౌమిన్​ రాయ్​ను తొలగించాలని స్థానిక భాజపా నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్ష సైతం చేపట్టారు.

ప్రధానిపై చిదంబరం చిర్రుబుర్రు!

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బెంగాల్‌ను జయించాలని అత్యవసర యుద్ధమే ప్రకటించారు. అంతటి యుద్ధంలోనూ కరోనా మహమ్మారిపై సమీక్ష చేయడానికి రవ్వంత సమయం కేటాయించారు. అందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ చిదంబరం ఎద్దేవా చేశారు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ సీఎం దీదీని ఉద్దేశిస్తూ  దీదీ… ఓ దీదీ.. అంటూ సంబోధించారని, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా సంబోధించడం సమంజసమేనా? అని చిదంబరం ప్రశ్నించారు. మాజీ ప్రధానులు నెహ్రూ, మొరార్జీ, వాజ్‌పాయ్ కూడా ఇలాంటి సంబోధన చేయలేదని చిదంబరం పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్లు లేవు’ అని ఆస్పత్రుల్లో బోర్డులు వెలుస్తున్నాయని, అయినా సరే దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని చిదంబరం మండిపడ్డారు.

 

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju