NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Kamal Hassan: పాలిటిక్స్ లో కమల్ దారెటు..!? చిరంజీవి, పవన్ లే ఉదాహరణలు

kamal hassan political journey confusion

Kamal Hassan: కమల్ హాసన్ Kamal Hassan ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లోకి వెళ్లారు. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. పరాభవం ఎదురైంది. వెనకడుగేయకుండా 2021 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. జనం ఆయన్ను నమ్మలేదు. సినిమాలు చూసిన ప్రేక్షకులు, సభలకు వచ్చిన జనం ఓట్లేయలేదు. ఎన్నికల్లో పార్టీకి ఘోర ఓటమి. ఒక్క సీటు గెలవలేదు. కమల్ కూడా ఓడిపోయారు. రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. పార్టీ ఉపాధ్యక్షుడితోసహా చాలా మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. రాజకీయాలపై ఓ తమిళ ఇంటర్వ్యూలో రజినీ, కమల్ ను ఉద్దేశించి చిరంజీవి చెప్పారు. ‘సలహాలివ్వొద్దు.. రాజకీయాలు నాకు తెలుసు’ అని చిరంజీవికి కమల్ దాదాపుగా కౌంటరే ఇచ్చారు.

kamal hassan political journey confusion
kamal hassan political journey confusion

ప్రస్తుతం కమల్ నడి సముద్రంలో ఉన్నారు. రాజకీయాలా? సినిమాలా? సినిమాలు చేస్తూ రాజకీయాలా? ఇవే ఆయన ముందున్న సందేహాలు. ఓటమి తర్వాత పార్టీలోని కీలక నేతలే వెళ్లిపాయారు. పోరాడాలంటే ఎమ్మెల్యేలు లేరు. అభిమానులు తోడు వస్తారా? వాళ్లని కమల్ నడిపిస్తారా? ఓపక్క భారతీయుడు2, విక్రమ్ సినిమాలు మధ్యలో ఉన్నాయి. ఇటు చూస్తే తమిళ కొత్త రాజకీయాలు ప్రారంభమై ఒక్కరోజే అయింది. ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా ఏడాది పడుతుంది. మళ్లీ ఎన్నికలంటే ఐదేళ్లు. అంత ఓపిక, పట్టుదల కమల్ కు ఉన్నాయా? మరోవైపు ఉద్దండులు లేకపోయినా తమిళులకు ద్రవిడ పార్టీలే కావాలని తేలిపోయింది. ఈ నేపథ్యంలో కమల్ రాజకీయ భవిష్యత్తుకు తెలుగు సినిమా స్టార్లు చిరంజీవి-పవన్ కల్యాణ్ రాజకీయ పయనాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం ఓడినా ఆయన గెలిచి, 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. వారితో పాలిటిక్స్ కంటిన్యూ చేయొచ్చు.. కానీ చేయలేదు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేశారు. కొన్నాళ్లకు రాజకీయాలను వదిలేసి సినిమాల్లోకి వచ్చి మునుపటి మెగాస్టార్ రేంజ్ చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్.. 2014లోనే జనసేన పార్టీ పెట్టినా ఐదేళ్లు అభిమానులతోనే పార్టీని నడిపారు. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ ఓడిపోయినా ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్నారు. ఇప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తూ సినిమాలు చేస్తున్నారు. అయితే.. ఇటువంటి వాటి గురించి ఆలోచించకుండా కమల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పలేం. తెలుగు రాజకీయ ఫలితాలే తమిళంలోనూ వచ్చాయి. మరి.. కమల్ ఆలోచనేంటో..!

 

 

 

 

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju