Mahesh Babu: త్రివిక్రమ్ గత కొన్నాళ్ల నుండి చేస్తున్న సినిమాలలో సీనియర్ హీరోయిన్లను రిపీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. “అత్తారింటికి దారేది” సినిమాలో.. నదియా, “అలా వైకుంఠపురంలో” సినిమాలో టబు నీ యాక్ట్ చేయించాడు. ఇదిలా ఉంటే త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకి “పార్ధు” అనే టైటిల్ పెట్టే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన “అతడు”, “ఖలేజా” సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలుసు. మహేష్ నటనలో సరికొత్త కోణాలు ఈ రెండు సినిమాలలో కనిపించాయి. ప్రొఫెషనల్ కిల్లర్ గా సైలెంట్ మెచ్యూరిటీ యాక్టింగ్ కలిగిన వాడిగా మహేష్ “అతడు”లో హావభావాలను పలికించాడు. ఇక అప్పటిదాకా ఇండస్ట్రీలో కామెడీ సరిగ్గా చేయలేడు మహేష్ అని టాక్.. భయంకరంగా ఉన్న టైంలో “ఖలేజా”లో తనలో ఉన్న కామెడీ.. కోణాన్ని బయటపెట్టి.. అదరగొట్టేశాడు. “ఖలేజా” సినిమా తర్వాత చాలావరకు మహేష్ కామెడీ నేపథ్యంలో.. సినిమాలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో చేయబోయే సినిమాలో.. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చేత యాక్ట్ చేయించడానికి… రెడీ అవుతున్నారట. గతంలో మహేష్ బాబుతో “యువరాజు” అనే సినిమాలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. తర్వాత మరోసారి ఇప్పుడు మహేష్ తో సినిమా నటిస్తున్నట్లు వార్త తెలియడంతో అభిమానులు.. చాలా రోజుల తర్వాత తెలుగులో సిమ్రాన్ కనబడుతోంది అని అంటున్నారు.
Trivikram