Simhadri: దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్ స్టార్టింగ్ లో ఫస్ట్ సినిమా “స్టూడెంట్ నెంబర్ వన్”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా చేయకముందు ఎన్టీఆర్ “నిన్ను చూడాలని” అనే సినిమా చేశాడు. మొదటిసారి హీరోగా ఆ సినిమా చేసిన.. పెద్దగా గుర్తింపు దక్కలేదు. “స్టూడెంట్ నెంబర్ వన్” సినిమా తో.. కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని.. ఎన్టీఆర్, రాజమౌళి ఒకేసారి దక్కించుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్, రాజమౌళి పేరు ఇండస్ట్రీ లో బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రాజమౌళి… చేసిన సినిమా “సింహాద్రి”.
ఎన్టీఆర్ తో ఈ సినిమా ద్వారా మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని రాజమౌళి అందుకోవడం జరిగింది. ఎన్టీఆర్ కెరియర్లో మాత్రమే కాక ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది సింహాద్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… చిరస్థాయిగా గుర్తుండిపోయే రీతిలో నందమూరి అభిమానులను ఎంతగానో “సింహాద్రి” ఆకట్టుకుంది. డాన్స్ పరంగా లేదా యాక్షన్ పరంగా.. ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు చేసిన ఫైట్లు రాజమౌళి టేకింగ్ అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ మొట్టమొదటిసారిగా.. రాజమౌళి మరో సీనియర్ హీరో కి అప్పట్లో వినిపించటం జరిగిందట.
అప్పటికే ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆ హీరో సినిమాలు… బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తూ ఉండటంతో ఆ తరహాలోనే “సింహాద్రి” స్టోరీ ఉండటంతో.. రాజమౌళి స్టోరీ ఆయనకు వినిపించగా ఆయన రిజెక్ట్ చేసినట్లు సరికొత్త వార్త సోషల్ మీడియాలో వినబడుతుంది. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలయ్య బాబు. అప్పటికే “సమరసింహారెడ్డి”, నరసింహ నాయుడు.. లాంటి రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ స్టోరీలతో.. సినిమాలు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ ని బాలకృష్ణ షేక్ చేస్తున్న టైం అది. ఆ టైంలో సింహాద్రి ఆయనతో చేయాలని రాజమౌళి భావించగా ఆయన వద్దనడంతో వెంటనే… ఎన్టీఆర్ తో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నడు రాజమౌళి. తాజాగా ఈ వార్తను నందమూరి అభిమానులు విని… బాలయ్య బ్లాక్ బస్టర్ స్టోరీ మిస్ చేసుకున్నాడు అని అంటున్నారు.