NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

YS Jagan: Jagan Trollers Failed New Scheme

AP CM YS Jagan: రాష్ట్రం ఆర్థిక కష్టాలలో ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను నేడు విడుదల చేశారు.  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్ గురువారం కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేశారు.

AP CM YS Jagan released ysr rythu bharosa
AP CM YS Jagan released ysr rythu bharosa

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ వై ఎస్ ఆర్ రైతు భరోసా కింద మూడో ఏడాది తొలి విడత సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత కోవిడ్ కష్టకాలంలో ఆర్థిక వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని  రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. 52లక్షల 38వేల మంది రైతుల ఖాతాలో 3,928.88 కోట్ల సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు మూడు విడతలుగా రూ.13,500లు అందజేస్తున్నామని జగన్ తెలిపారు. ఖరీఫ్ కు ముందు మొదటి విడత కింద రూ.7,500లు అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా దేవాదాయ శాఖ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందుతోందన్నారు.

 

ఇప్పటి వరకూ రైతు భరోసా కింద 13,101 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ.1729 కోట్లు జమ చేశామని చెప్పారు. 23 నెలల పాలనలో ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ పంటల భీమా, వైఎస్ఆర్ భరోసాల కింద రైతులకు 68వేల కోట్లు సాయం చేశామని వైఎస్ జగన్ అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju