NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CID Case: వైసీపీ శ్రేణులు ఖంగుతినే వార్త ఇది..! రఘురామకు బెయిల్ ఎవరు ఇప్పించారంటే..?

AP CID Case: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు పేరు చెబితేనే ఆ పార్టీలోని నాయకులు అందరికీ కోపం రగిలిపోతుంది. వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై రఘురామ కృష్ణం రాజు నెలలు తరబడి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ గ్రామ స్థాయి నాయకుడి నుండి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు మొదలు కొని మంత్రుల వరకూ రఘురామ పేరు చెబితే తీవ్ర స్థాయిలో మండిపడతారు. ఇటీవల ఏపీ సీఐడి ఆయనను రాజద్రోహం, తదితర సెక్షన్ల కింద అరెస్టు చేయడంతో ఆ పార్టీ నేతలు, సానుభూతి పరులు, అభిమానులు ఏంతో సంతోషించారు. ఇన్నాళ్లకు పాపం పండింది, జైలు ఊచలు లెక్క పెట్టించేశారు జగన్ అంటూ తెగ సంబరపడ్డారు.

AP CID Case mukul rohatgi
AP CID Case mukul rohatgi

అయితే రఘురామ జైలులో ఒక రోజు మాత్రమే ఉండి ఆ తరువాత ఆసుపత్రికి వెళ్లడం, సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు కావడం జరిగిపోయాయి. రాజద్రోహం కేసులో కనీసం పది పదిహేను రోజులు అయినా జైలు జీవితం గడపకుండా రఘురామ కృష్ణం రాజు సుప్రీం కోర్టు నుండి బెయిల్ ద్వారా బయటకు వచ్చారంటే విశేషమే మరి. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. రఘురామకు బెయిల్ ఇప్పించింది ఎవరో తెలిస్తే వైసీపీ వర్గీయులు ఒక్క సారిగా షాక్ అవుతారు. ఎందుకంటే రఘురామ తరపున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కావడం గమనార్హం. ఈ న్యాయవాదే ఏపి ప్రభుత్వానికి సంబంధించి పలు కీలక కేసులను వాదిస్తున్నారు.

AP CID Case mukul rohatgi
AP CID Case mukul rohatgi

ఏపి రాజధానుల కేసుతో పాటు విశాఖ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన కేసుల్లో జగన్ సర్కార్ తరపున ముకుల్ రోహత్గీనే వాదనలు వినిపిస్తున్నారు. గత ఏడాది రోహత్గీకి ఫీజు చెల్లింపులకు సంబంధించి జగన్ ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేసింది. ఓ రకంగా చెప్పాలంటే  జగన్ సర్కార్‌కు ఆస్థాన న్యాయవాది అయిన రోహత్గీ .. రఘురామకు బెయిల్ రావడానికి కారణం అయ్యారని తెలియడం వైసీపీ వర్గీయులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. అయితే ఈ విషయంలో రోహత్గీని ఎవరూ తప్పుబట్టడానికీ వీలులేదు. ఎందుకంటే తన క్లైయింట్ కు న్యాయం జరగడం కోసం వృత్తి ధర్మాన్ని ఆయన నిర్వర్తించారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju