NewsOrbit
జాతీయం న్యూస్

France President Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడికే పౌరుడి నుండి పరాభవం..! నేతలూ జర జాగ్రత్త..!!

France President Macron: రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వివిధ సందర్భాల్లో పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కరచాలనం చేస్తుండటం సహజమే. అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నా ఒక్కో సందర్భాల్లో నేతలపై చెప్పులు విసరడం, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన చేయడం చూస్తూనే ఉంటాం. పెద్ద ఎత్తున గుమిగూడిన వ్యక్తుల్లో ఎవరు అభిమానులో, ఎవరు ప్రతిపక్షాలకు చెందిన వారో తెలియని పరిస్థితులు ఉంటాయి. ఈ సందర్భాల్లో ఒక్కోసారి నేతలకు పరాభవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనే మంగళవారం ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్ కు సదర్న్ ఫ్రాన్స్ లోని డ్రోమ్ ప్రాంతంలో పరాభవం ఎదురైంది.

France President Macron slapped in the face
France President Macron slapped in the face

వచ్చే సంవత్సరం ఫ్రాన్స్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధ్యక్షుడు మేక్రాన్ దేశ వ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. రాబోయే రెండు నెలల్లో 12 ప్రాంతాల్లో పర్యటించేందుకు అధికారులు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ క్రమంలో రెండో పర్యటనలో భాగంగా మంగళవారం డ్రోమ్ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ బారికేడ్ల అవతల ఉన్న ప్రజలకు కరచాలనం చేస్తుండగా ఓ యువకుడు అధ్యక్షుడి చెంప పై కొట్టాడు. ఊహించని ఈ హఠాత్మరిణామానికి అక్కడ ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు. అక్కడ ఉన్న రక్షణ సిబ్బంది వెంటనే అధ్యక్షుడిని వెనక్కు తీసుకువెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తితో పాటు మరొకరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read More: MP Navneet Kaur: అమరావతి ఎంపి నవనీత్ కౌర్ కు భారీ ఝలక్ ఇచ్చిన బాంబే హైకోర్టు 

అయితే ఈ ఘటనను మేక్రోన్ తేలిగ్గా తీసుకోగా ప్రధాని జీన్ కాస్టెక్స్ దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. రాజకీయాలు హింసాత్మకంగా మారకూడదన్నారు. వ్యక్తిగత దూషణలకు, భౌతిక దాడులు మంచిపద్దతి కాదన్నారు. కాగా ఫ్రాన్స్ లో అధ్యక్షుని వ్యతిరేకులు చాలా మంది ఉన్నారు. ఈ పాలనలో అరాచకం పెరిగిపోయిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ పార్టీకి మద్దుతుదారుడే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju