NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పు రిజర్వు..! ఇంటర్వ్యూలపై సర్వత్రా ఉత్కంఠ..!!

AP High Court: ఏపిలో గ్రూపు – 1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న అభియోగంతో హైకోర్టులో దాఖలైన పిటిషన్ లపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి 8 పిటిషన్ లు దాఖలు కాగా విచారణ సందర్భంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. గ్రూపు 1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్ ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూషన్ గురించి చివరి దశలో తెలిపారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తెలుగు మీడియం పేపర్ లను రాష్ట్రంలో, ఇంగ్లీషు మీడియం పేపర్లు ఇతర రాష్ట్రాల్లో వాల్యూషన్ చేశారనీ, దీంతో ఇంగ్లీషు మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని  పిటిషనర్ ల తరపు న్యాయవాది పేర్కొన్నారు.

AP High Court: group1candidates exam case judgment reserve
AP High Court: group1candidates exam case judgment reserve

ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్ ఎలా చేయిస్తుందని ప్రశ్నిస్తూ..ఏపీపీఎస్సీ చైర్మన్ ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంటర్వ్యూల నిలుపుదలకు మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

 

ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలో వ్యాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదనీ, నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించామని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. దీంతో త్వరలో జరగనున్న గ్రూప్ 1 ఇంటర్వ్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?