NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేవంత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్ … దొంగ అంటూ…

Revanth Reddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి ఊహించ‌ని ఎదురుదాడి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను రాళ్ల‌తో కొట్టాల‌ని రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌ద‌రు ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. సహచర ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రేవంత్ పై విరుచుకుప‌డ్డారు. ఎమ్మెల్యేను కొనబోయి దొరికిన దొంగవి.. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిలర్ గా ఎదిగిన నేతవు నువ్వేనంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై డి ధ్వజమెత్తారు.

Read More: Revanth Reddy: రేవంత్ తీసుకునే నిర్ణ‌యంపై కాంగ్రెస్‌లో టెన్ష‌న్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
మమ్మల్ని రాళ్లతో కొట్ట మంటావా..నీ క్యారక్టర్ ఏంది.. మా క్యారక్టర్ ఏంది అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారమే తాము కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశామన్నారు. నువ్వు కాంగ్రెస్ లో చేరినప్పుడు ఎమ్మెల్యే గా రాజీనామా ఎందుకు చేయలేదు..? ఎమ్మెల్యే గా రాజీనామా లేఖను అసెంబ్లీ కి ఎందుకు పంపలేదు అని నిలదీశారు. నువ్వు రాళ్లతో కొడితే మేము చెప్పులతో కొడుతం.. అంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి డబ్బులతో మేనేజ్ చేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాడని.. ఎన్నో త్యాగాలు చేసి ఏ పదవి రాక చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం టాగూర్ కు 25 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్న నిన్ను చూసి సీనియర్ నేతలు రోదిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి రావడం కల్ల.. రేవంత్ రెడ్డి చివరికి జోకర్ గా మిగులుతాడని ఆయన జోస్యం చెప్పారు.

Read More: KCR: కేసీఆర్‌కు ఇంత కుల‌పిచ్చి ఉందా?

రేవంత్ రెడ్డికి వాళ్ల‌తో టీం ఉందా?
సమాచార హక్కు చట్టాన్ని దుర్వియోగం చేసింది రేవంత్ రెడ్డే నని ఎమ్మెల్యే ఆరోపించారు. రిటైర్డ్ సర్వేయర్ లు, ఆర్.ఐలతో టీంలు తయారు చేసుకొని ..భూములపై సమాచార హక్కు ద్వారా వివరాలు తెప్పించుకుని.. అందులో లొసుగులు తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేయటం రేవంత్ రెడ్డికి అలవాటు అని సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఈ కామెంట్ల‌పై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో మ‌రి.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju