KCR: కేసీఆర్‌కు ఇంత కుల‌పిచ్చి ఉందా?

Share

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యంలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఆయన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు గులాబీ ద‌ళ‌ప‌తిపై సంచ‌ల‌న కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వివిధ కుల‌స్తుల కోసం చేసిన భూ కేటాయింపుల విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వెలమ, కమ్మ కమ్యూనిటీల భవనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించింది. ఈ రెండు భవనాల కోసం ఎంతో డిమాండ్ ఉన్న హైటెక్ సిటీకి దగ్గరలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Read More: KCR: కేసీఆర్ అవాక్క‌య్యేలా చేస్తున్న కాంగ్రెస్

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం
ఆలిండియా వెలమ అసోసియేషన్‌ కు 5 ఎకరాల భూమి, కమ్మ సమాఖ్యకు 5 ఎకరాల భూమిని మంజూరు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ రెండు భవనాల కోసం ఎంతో డిమాండ్ ఉన్న హైటెక్ సిటీకి దగ్గరలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఖానామెట్ గ్రామంలోని సర్వే నెం. 41/14లో భూమి కేటాయించారు. ఈ భూమిని వెంటనే ఆయా కమ్యూనిటీల ప్రతినిధులకు అప్పగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Read More : Revanth Reddy: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

అక్క‌డే అస‌లు చిక్కు…
వెలమ, కమ్మ కమ్యూనిటీ భవనాల కోసం ఎంతో విలువైన ప్రాంతంలో భూమి కేటాయించడం పట్ల ఓ ర‌క‌మైన కామెంట్లు వ‌స్తుంటే… మ‌రోవైపు కొత్త అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2018 ఎన్నికలకు ముందే బీసీ వర్గానికి చెందిన 23 కులాలకు కమ్యూనిటీ భవనాల కోసం ఎకరం చొప్పున కేటాయించింది. ఆ కమ్యూనిటీ భవనాల కోసం అవుటర్ రింగ్ రోడ్డు, కోకాపేట్ ప్రాంతాలలో భూకేటాయింపులు జరిగాయి. అయితే బీసీలకు సిటీకి దూరంగా భూములు కేటాయించి.. కమ్మ, వెలమలకు మాత్రం హైటెక్ సిటికి అరకిలోమీటర్ దూరంలో భూమి కేటాయించడంతో ఆయా కుల సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. బీసీలకు అవుటర్ రింగ్ రోడ్డులో కేటాయించడం.. కమ్మ, వెలమలకు హైటెక్ సిటీలో కేటాయించడమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా బీసీలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని బీసీ నాయకులు, గులాబీ ద‌ళ‌ప‌తి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు మండిపడుతున్నారు.


Share

Related posts

జ‌గ‌న్ సెల్ఫ్ గోల్ … 150 సార్లు ఇలాగే

sridhar

pregnant issues: స్త్రీ  పురుషుల్లో తలెత్తే  సంతాన సమస్యలకు కూల్ డ్రింక్స్ కారణమని  మీకు తెలుసా ??

siddhu

కేంద్రం చేతిలో కీలక బిల్లు..!! ఇక వ్యవసాయంలో మార్పులే..!!

Muraliak