Surya: ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టానికి సంబంధించి 1952 నాటి చట్టం ను సవరిస్తూ సరికొత్త చట్టాలను తీసుకు రావడం తెలిసిందే. తాజా చట్టంపై చాలా మంది హీరోలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన సినిమా పెద్దలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో హీరో సూర్య ఈ చట్టం పై స్పందించారు.
ఇది పూర్తిగా బావ స్వేచ్ఛ ప్రకటనను హరించడమే అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతమాత్రమే కాకుండా బావ స్వేచ్ఛ ప్రకటనను కాపాడుట కోసం.. కొత్త చట్టాలను తీసుకు రావాలి… కానీ బావ స్వేచ్ఛ ప్రకటన నాశనం చేయడం కోసం ఈ రీతిగా ప్రభుత్వాలు వ్యవహరించటం దారుణమని సూర్య స్పష్టం చేశారు. దీంతో ఈ హీరో సూర్య చేసిన కామెంట్లపై తమిళనాడు రాష్ట్ర బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Read more: Surya 40 : సూర్య 40 కూడా అదే జోనర్..మరో బ్లాక్ బస్టర్ పక్కా.!
హీరో సూర్య కేవలం తన సినిమాల గురించి పట్టించుకుంటే బాగుంటుంది మిగతా విషయాలు.. అనవసరం అంటూ తమిళనాడు బిజెపి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే రీతిగా వ్యవహరిస్తే న్యాయపరంగా హీరో సూర్య పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. తమిళనాడు రాష్ట్ర బీజేపీ యువ నేతలు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీ నాయకులు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోపక్క హీరో సూర్య అభిమానులు.. రాజకీయ పార్టీలు తమ అభిమాన హీరో పై చేస్తున్న కామెంట్లపై.. ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.