Lal Singh Chadda : అక్కినేని నాగచైతన్య మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. లాల్ సింగ్ చద్దా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాతో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీలో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈ సినిమా గురించి రక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని ఇటు చైతన్య గానీ, అటు అమీర్ గానీ స్పందించలేదు. కానీ తాజాగా ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ లో నాగ చైతన్య పాల్గొన్న లేటెస్ట్ ఫోటోని షేర్ చేసి ఇందులో నటిస్తున్న విషయాన్ని కన్ ఫార్మ్ చేసి రూమర్స్ కి చెక్ పెట్టారు.
కాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడఖ్ లో శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ గురువారం షూటింగ్ లో జాయిన్ అయిన నాగచైతన్య.. ఆన్ లొకేషన్ లో ఉండి అమీర్ ఖాన్ తో దిగిన తాజా ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తున్నందుకు గ్రేట్ ఫుల్ గా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు. ఇక తాజాగా షేర్ చేసిన ఫొటోలో చైతు – అమీర్ మిలిటరీ డ్రెస్ లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
Lal Singh Chadda : ‘ఫారెస్ట్ గంప్’ కి లాల్ సింగ్ చద్దా అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది.
ఇక ఇపుడు లడక్ లో ప్లాన్ చేసిన షెడ్యూల్ లో 20 రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారట. అమీర్ ఖాన్ – చైతన్యలు పాల్గొనే వార్ సీన్స్ ను తెరకెక్కించనున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ టామ్ హాంక్స్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ కి లాల్ సింగ్ చద్దా అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను అన్నీ అనుకున్నట్టు పూర్తయితే 2021 క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేలా ప్రణాళిక వేశారు. నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ రిలీజ్ కి రెడీగా ఉంది. థాంక్యూ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.