NewsOrbit
న్యూస్ సినిమా

Vikram: ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ రిలీజ్..! ముగ్గురు మొనగాళ్లు ఒకే ఫ్రేమ్ లో..

vikram first look creating sensation

Vikram: విక్రమ్ Vikram లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరక్టర్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవికి ఎంతగానో కలిసొచ్చిన ఖైదీ.. లోకేశ్ కూ అంతే కలిసొచ్చింది. దీంతో లోకేశ్ ప్రాజెక్టులపై క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ తో చేసిన మాస్టర్ సినిమాపై విమర్శలు వచ్చినా సంచలనాలు రేపింది. ఇప్పుడు కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేస్తున్నాడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలోనే రిలీజైన మోషన్ టీజర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. కరోనా, లాక్ డౌన్ టైమ్ కావడం వల్ల సినిమా ప్రారంభం ఆలస్యమైంది. ఇప్పుడు విక్రమ్ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేసింది చిత్ర బృందం.

vikram first look creating sensation
vikram first look creating sensation

సినిమాలో నటిస్తున్న ముగ్గురు దిగ్గజాలతో క్లోజ్ అప్ షాట్స్ ను బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించారు. ముగ్గురూ గడ్డంతో గంభీరమైన లుక్ లో పెద్ద వయసు వారిలా కనిపిస్తున్నారు. ముగ్గురూ జాతీయస్థాయి నటులు, విలక్షణ నటులుగా పేరు ఉండటం.. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు కావడంతో అంచనాలు  ఆకాశాన్నంటుతున్నాయి. పైగా.. కమల్, లోకేశ్ సినిమాపై చేసిన ట్వీట్లు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘శౌర్య పరాక్రమాలు ఉన్నవాడే కిరీటాన్ని ధరించాలి. మాకున్న ప్రతిభను మీముందు ఉంచుతున్నాం. విజయాన్ని ఇవ్వండి’ అని కమల్.. ‘అదిగదిగో యుద్ధంతో వెలుగు.. శబ్ధంతో అరాచకత్వం నాశనమే.. రక్తంతో ఉన్న తల.. ఇదిగో కంపిస్తున్న స్వర్గం.. గెలుపు నిజం’ అని అర్ధం వచ్చేలా లోకేశ్ చేసిన ట్వీట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ముగ్గురూ స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తూండటంతో ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి పెరిగిపోయింది. యాక్షన్, థ్రిల్లర్ అని అర్ధమవుతున్నా.. సినిమాలో కథే కీలకం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ విలన్లా నటిస్తున్నారని తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత గిరీష్ గంగాధరన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు తగ్గడంతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 

 

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N