Gopichand:హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం లక్ష్యం..!! ఈ చిత్రం 2007 లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.. అంతేకాకుండా ఈ చిత్రానికి నంది అవార్డు కూడా లభించింది.. గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం లౌక్యం..!! ఈ చిత్రం 2014 లో విడుదలై సూపర్ హిట్ అయింది.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 21.5 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.. తాజాగా గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రూపొందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్..!!
ఈ చిత్రం రూపొందనున్నట్లు ఎనౌన్స్ మెంట్ తో పాటు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో.. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ తోనే సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి ప్రేక్షకుల్లో.. గోపీచంద్ కెరీర్ లో 31 చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ నిర్మిస్తున్నారు.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి భూపతి రాజా కథని రాశారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలియజేశారు నిర్మాతలు.. అయితే ఈ సినిమాలో నటించే తారాగణం గురించి ఇంకా తెలియజేయలేదు.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాల పేర్లు కూడా “ల” అనే అక్షరం తోనే మొదలయ్యాయి.. అయితే ఈ సినిమాకు కూడా “ల” అనే పేరుతోనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. అలాగే వీరిద్దరి సినిమా రిలీజ్ డేట్ నుంచి చూసుకుంటే 2007, 2014 అంటే ఏడు సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నారు.. ఇప్పుడు 2021లో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానుంది.. అంటే లక్ ప్లస్ సెంటిమెంట్ తో కలిసి కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు..