NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TTD Chairman: వద్దువద్దంటున్నా ఆ నేతకు మళ్లీ అదే పదవి..! వైవీ అలకవీడినట్లేనా..!?

TTD Chairman: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఈ పదవి కోసం రాజకీయ నేతలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అవసరమైతే ఎన్ని కోట్ల రూపాయలు అయినా పార్టీ ఫండ్ ఇవ్వడానికి సిద్ధమవుతారు. శ్రీవారి సేవ చేసే అదృష్టం రావడమే మహాభాగ్యంగా భావించే ఎందరో నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. కనీసం డైరెక్టర్ పదవి లభించినా చాలు అనుకునే వారు ఏపితో సహా పలు రాష్ట్రాలలో నేతలు ఉన్నారు. డైరెక్టర్ పదవులకే కేంద్ర మంత్రులు సిఫార్సు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పటికే ఒక పర్యాయం టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన వైవీ సుబ్బారెడ్డి మరో సారి ఆ పదవిలో కొనసాగడానికి సముఖత చూపడం లేదని సమాచారం.

YV Subba Reddy again appointed as TTD Chairman
YV Subba Reddy again appointed as TTD Chairman

టీటీడీ చైర్మన్ గా ఉంటే ప్రత్యక్ష రాజకీయాల నుండి దూరంగా ఉండాల్సి వస్తోందని దీంతో తన వర్గీయులకు న్యాయం చేయలేకపోతున్నానన్న భావనతో వైవీ సుబ్బారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహించాలన్నది ఆయన మనోగతంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవల వైసీపీ సర్కార్ పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సందర్భంలో టీడీపీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పేరు మరో సారి ప్రతిపాదించింది. దీనిపై సుముఖంగా లేని వైవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా అమెరికా వెళ్లిపోయారు. అయితే వైవీ సమ్మతించారో లేదో కానీ ప్రభుత్వం ఆయనను టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకమండలి సభ్యులను మాత్రం ఈ రోజు ప్రభుత్వం ప్రకటించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కమిటీ నియామకం ఉంటుందని తెలుస్తోంది.

కాగా పాలకమండలిలో చోటు కోసం చాలా మంది వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వానికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గత పాలకవర్గంలో సభ్యుల సంఖ్యను 18 నుండి 37 కి పెంచి జెంబో పాలకమండలిని తీసుకొచ్చారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు అన్ని పూర్తి చేయడంతో పదవులు దక్కని వారు టీటీడీలో చోటు కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారని సమాచారం.

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?