NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Neeraj Chopra: 2019 లో కనీసం తన చేయి లేపలేకున్నాడు… 2021 లో ఏకంగా బంగారు పతకం ఎత్తాడు!

Neeraj Chopra suffers serious elbow injury in 2019

Neeraj Chopra: ఈరోజు అంటే నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ లో భారత్ తరపున తొలి ఒలింపిక్ పతకం సాధించాడు. అయితే గత వందేళ్లలో భారత్ కి ఒకసారి కూడా అథ్లెటిక్స్లో కనీసం కాంస్యం కూడా దక్కక పోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందులో ముఖ్యంగా ఫిట్నెస్ సమస్యలు ఉంటాయి. మన అథ్లెట్లు ఎంతో మంది ఫిట్నెస్ సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో సత్తా చాటలేకపోయారు. మిల్కా సింగ్ నుండి పి.టి.ఉష వరకు ప్రతి ఒక్కరూ పతకం కొట్టే సామర్థ్యం ఉన్న వారే కానీ గాయాల కారణంగా గాడి తప్పి చివరి నిమిషంలో చరిత్ర ముంగిట సాగిలపడడం భారతీయులకు మామూలే అయిపోయింది.

 

Neeraj Chopra suffers serious elbow injury in 2019

ఏకంగా మోచేయే…

అయితే ఎంతో టాలెంట్ ఉన్న నీరజ్ కూడా ఇలాగే తన కెరీర్ అస్తవ్యస్తం అయ్యే స్థితి నుండి కోలుకొని తిరిగి లేచాడు. 2019 మధ్యలో అంటే ఏడాదిన్నర క్రితం చోప్రా మోచేతికి అతి పెద్ద గాయం అయింది. ఒక జావలిన్ త్రోయర్ కు మోచేయి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి కీలకమైన మోచేయి శస్త్రచికిత్సను నీరజ్ కు ముంబైకి చెందిన దిన్షా పరిద్వాలా చేశారు. పరిద్వాలా నీరజ్ కే కాకుండా ప్రధాన భారతీయ క్రికెటర్లైన జస్ప్రిత్ బూమ్రా, శ్రేయస్ అయ్యర్ లకు కూడా గతంలో ఎన్నో ఎముకలు, కీళ్లకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేశారు. 

Neeraj Chopra suffers serious elbow injury in 2019

అలాగే భారత స్టార్ క్రీడాకారిణులు అయిన సైనా నెహ్వాల్, పివి సింధు, పోగాట్ సిస్టర్స్ లకి కూడా ఈయనే ఆర్థోపెడీషియన్ గా ఉన్నారు. కానీ నీరజ్ కి శస్త్ర చికిత్స చేయడంలో కొద్దిగా పొరపాటు జరిగినా ఇక జీవితంలో అతను జావెలిన్ లేపలేకపోయేవాడని ఉద్వేగభరితుడైన పరిద్వాలా శనివారం చెప్పుకొచ్చారు. 2019లో మోచేయి గాయం కారణంగా దోహా ప్రపంచ ఛాంపియన్షిప్ కు నీరజ్ చోప్రా దూరం అయ్యాడు. అది చాలా సీరియస్ గాయం.

Neeraj Chopra: అయిదు నెలలు ఫీల్డ్ కి దూరం

మే 3వ తేదీన దీరూ భాయ్  అంబానీ ఆస్పత్రిలో పరిద్వాలా కి శస్త్రచికిత్స జరిగింది. అతను కుడి చేయి మోచేతికి గాయం కావడంతో జీవితంలో ఇంకెప్పుడు అతను జావెలిన్ విసరలేడు అని అనుకున్నారు. అతని మోచేయ్ కూడా స్థిరంగా ఒకచోట ఉండిపోయింది. అటూ ఇటూ కదలడం లేదు. లోపల ఉండే కణజాలాలు మొత్తం చీలిపోయాయి. ఆ కణజాలాలను తీసేసి రిపేర్ చేయవలసిన పరిస్థితి. దాదాపు రెండు గంటల సర్జరీ తర్వాత అతను నాలుగు నెలలు రిహబిలెషన్ కు వెళ్ళాడు. 

Neeraj Chopra suffers serious elbow injury in 2019

కట్ చేస్తే… ఒలింపిక్ విన్నర్

ఆ తర్వాత కూడా నీరజ్ చోప్రా మళ్లీ కోలుకుంటాడు అని ఎవరికీ ఆశలు లేవు. ఇక అతని కెరీర్ ముగిసిపోయింది అని అనుకున్నారు. అయితే నీరజ్ చోప్రా మాత్రం మానసికంగా బలంగా ఉండి మళ్ళీ ఫీల్డ్ కి తిరిగి వచ్చాడు. ఎంతో కఠోర శ్రమ ఒత్తిడి అనుభవించిన నీరజ్ చోప్రా తను కోలుకున్నాక నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి ఈసారి ఒలింపిక్స్లో తాను కచ్చితంగా బంగారు పతకం సాధిస్తానని అన్నాడు. ఆ సంకల్పం, నమ్మకమే అతన్ని ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ గా నిలిపింది. తన చేతిని పైకి ఎత్తలేడు అనుకున్న నీరజ్ చోప్రా ఏకంగ బంగారు పతకం ఎత్తి అందరికీ స్పూర్తిని ఇచ్చాడు.

author avatar
arun kanna

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju