NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gang Rape: గుంటూరు జిల్లాలో మరో దారుణం..! భర్తను కొట్టి భార్యను చెరపట్టి..

Gang Rape: ఓ పక్క రాష్ట్రంలో మహిళల భద్రతపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే గుంటూరు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళుతున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అనంతరం మహిళలపై దుండగులు అత్యాచారం చేశారు. ఈ ఘటన మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హజరై బైక్ పై తిరిగి ఇంటికి వెళుతుండగా మేడికొండూరు అడ్డ రోడ్డు సమీపంలో వీరిని కొందరు దుండగులు అడ్డగించారు. బైక్ పై ఉన్న వ్యక్తిపై దాడి చేసి అతని భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Gang Rape in guntur dist
Gang Rape in guntur dist

ఈ ఘటనపై బాధితురాలు అర్థరాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా, ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధి కాదంటూ ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారు. ఘటన ఎక్కడ జరిగినా ఫిర్యాదు అందిన పోలీస్ స్టేషన్ లో జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధింత స్టేషన్ కు ఎఫ్ఐఆర్ ను బదిలీ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు.

ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. బైక్ పై వెళుతున్న దంపతులుపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడటం అమానుషమన్నారు. ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు బాధితురాలు వెళితే తమ పరిధి కాదంటూ పోలీసులు చెప్పడం దారుణమని అన్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. జగన్ సర్కార్ లో ఏపి అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని దుయ్యబట్టారు. బాధితుల పరామర్శకు వెళ్లుంటే వేల మంది పోలీసులను రంగంలోకి దింపారని విమర్శించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju