NewsOrbit
న్యూస్

ఐపిఎస్ బదిలీలపై హైకోర్టులో పిటిషన్

అమరావతి, మార్చి 27: ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటిలిజెన్స చీఫ్‌తో పాటు మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్దపడింది.

ఎన్నికల విధులకు సంబంధం లేని ఉన్నతాధికారులను బదిలీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం, ఆ శాఖ ఉన్నతాధికారులు అభ్యంతరం  వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల బదిలీలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషన్‌పై  మధ్యాహ్నం కోర్టు విచారణ ప్రారంభమయ్యింది.

ప్రభుత్వం తరుపున ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మే 27వరకూ పోలీసు అధికారులు అంతా ఈసి పరిధిలోనే ఉంటారని కోర్టుకు విన్నవించారు.  ఎన్నికల విధుల్లోకి ఇంటెలిజెన్స్ డీజి లేరన్న విషయాన్ని తెలియజేశారు. ఎన్నికల విధుల్లో  ఇంటెలిజెన్స్ డిజి లేరన్న పత్రాన్ని కోర్టుకు సమర్పించాలన్నధర్మాసనం, సంబంధిత ఆధారాలతో ప్రమాణ పత్రాలను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.

కాగా కేసు విచారణలో తమనూ చేర్చాలని వైకాపా పిటిషన్ దాఖలు చేసింది. ఇంప్లీడ్ పిటిషన్ వేస్తామని వైసిపి ధర్మాసనానికి తెలియజేసింది. వైసిపి వాదనలను తరువాత వింటామని ధర్మాసనం పేర్కొంది.

పిటిషన్‌పై వాదనలు వినిపించాల్సిందిగా ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇంటిలిజెన్స్ చీప్ ఏబి వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్‌పిలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నం బదిలీలను  సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు అయ్యింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment