NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: హస్తినకు చేరుకున్న తెలంగాణ సీఎం కేసిఆర్..! పర్యటన రద్దు చేసుకున్న ఏపి సీఎం జగన్..! కారణం ఏమిటంటే..?

YSRCP: Party Internal Big Issues Causing Loose

AP CM YS Jagan: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఓ మంచి సన్నివేశాన్ని మిస్ అయ్యారు. ఢిల్లీలో రేపు జరగనున్న ఓ సమావేశంలో ఆసక్తికరమైన సన్నివేశాలు ఆవిష్కృతం అవుతాయని అందరూ భావించారు. కానీ ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి డిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడంతో ఆ సీన్ మిస్ అవుతున్నారు. ఇంతకూ విషయం ఏమిటంటే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి గురు శిష్యుల బందంగా ఎంతో ఆప్యాయంగా ఉన్న తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్ లు గత కొన్ని నెలలుగా ఎడ మోహం, పెడ మోహం గా ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసిఆర్ హజరైయ్యారు. తెలంగాణలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అతిధిగా జగన్మోహనరెడ్డి వెళ్లారు. కేసిఆర్ నివాసంలో విందుకు జగన్ హజరైయ్యారు. విభజన సమస్యలు అనేకం పెండింగ్ లో ఉన్నా కేసిఆర్ కోరిన వెంటనే హైదరాబాద్ లో ఏపి ప్రభుత్వ ఆధీనంలోని భవనాలను జగన్ ఎటువంటి షరతులు లేకుండానే అప్పగించేశారు. ఇలా ఉన్న వారు ఒక్క సారిగా శతృవులుగా ఎలా అయిపోయారు అనేది చాలా మందికి అంతుబట్టడం లేదు.

AP CM YS Jagan delhi tour cancelled
AP CM YS Jagan delhi tour cancelled

ఆంధ్రా ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్. తెలంగాణలోని ప్రాజెక్టులపై ఏపి ప్రభుత్వం కేంద్రానికి, బోర్డులకు ఫిర్యాదు చేసుకోవడం తెలిసిందే. కేసిఆర్ – జగన్ ల మధ్య విబేధాలు ఏమీ లేవనీ, ఇదంతా ఓ డ్రామా అని కూడా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు అనుకోండి. అది వేరే విషయం. ఆదివారం ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసిఆర్, జగన్ లు పాల్గొంటారని అందరూ అనుకున్నారు. అందుకు షెడ్యుల్ కూడా ఖరారు అయ్యింది. అయితే తెలుగు రాష్ట్రాల జల జగడం పంచాయతీ తరువాత చాలా రోజులకు వీరు ఇద్దరు ఎదురెదురు పడిన సందర్భంలో ఇంతకు ముందు మాదిరిగా మాట్లాడుకుంటారా? లేదా ముభావంగా ఎవరి పని వారు చూసుకుని వెళ్లిపోతారా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

file photo
file photo

ఈ తరుణంలో జగన్ పర్యటన రద్దు కావడం ఆ పరిణామాలను గమనిద్దామనుకున్న వారు నిరుత్సాహానికి గురైయ్యారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం కేసిఆర్ హస్తినకు శుక్రవారం రాత్రి చేరిపోగా జగన్ పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. ఏపి సీఎం జగన్ శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణకింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో వైద్యులు పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో జగన్ డిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళుతున్నారు. ఆమెతో పాటు ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ హజరవుతారు.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?