NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

AP Govt:  సినీ రంగానికి బిగ్ రిలీఫ్ ఇచ్చిన జగన్ సర్కార్..!!

AP Govt: కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూదేలన సంగతి తెలిసిందే. సినీ రంగ సమస్యలపై రాష్ట్రంలో ఇటీవల పెద్ద ‘వార్‌’యే జరిగింది. యాక్టర్ నుండి పొలిటీషియన్ గా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మువీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో సినీ రంగ సమస్యలను ప్రస్తావిస్తూ ఏపి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం, దానిపై ఏపి మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కౌంటర్ అటాక్ చేయడం తెలిసిందే. ఈ దుమారం నేపథ్యంలో సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానిని కలిసి పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆ నిర్మాతలే పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ విషయాలపై చర్చించారు.

AP Govt  Orders to 100 percent occupancy in Theatres
AP Govt Orders to 100 percent occupancy in Theatres

AP Govt:  ధియేటర్ లలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి

కాగా సినీ రంగ సమస్యలకు సంబంధించి నిర్మాతలు ఇచ్చిన విజ్ఞఫ్తిపై ఏపి సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఏపి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు సినీ రంగానికి బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు అయ్యింది. ఏపిలో సినిమా  హాళ్లను వంద శాతం అక్యుపెన్సీతో నిర్వహించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు (14వ తేదీ) నుండి సినిమా హాళ్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం రాష్ట్రంలో సినిమా థియేటర్ లను ఓపెన్ చేసినప్పటికీ..50 శాతం ఆక్సుపెన్సీతోనే సినిమా హాళ్లు నడుస్తున్నాయి.

నాలుగు ప్రదర్శనల ఆంక్షలు ఎత్తివేత

కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రం తెలంగాణలో నూరు శాతం ఆక్యుపెన్సీతో ధియేటర్ లు నడుస్తున్నాయి. ఏపిలోనూ నూరు శాతం అక్యుపెన్సీతో ధియేటర్ లు నడుపుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రోజుకు నాలుగు ప్రదర్శనలపై ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దసరా పండుగకు పలు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీ రంగానికి పెద్ద ఊరటను ఇచ్చినట్లు అయ్యింది.  కాగా వంద శాతం ఆక్యుపెన్సీ తో ధియేటర్ లు నడిపినా కరోనా నియంత్రణ చర్యలు తప్పని సరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయా సంస్థల ప్రతినిధులు ఏపి సీఎం వైఎస్ జగన్, మంత్రి పేర్ని నానిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri