NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Alimineti madhava reddy: అసలు ఎవరు ఈ ఎలిమినేటి మాధవరెడ్డి..??

Alimineti madhava reddy: రాజకీయ నాయకులు తమ రాజకీయాల కోసం దివంగతులైన వారిని వదిలిపెట్టరు. రెండు దశాబ్దాల క్రితం మృతి చెందిన ఎలిమినేటి మాధవరెడ్డి తెరపైకి తీసుకువచ్చి చంద్రబాబు కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం జరిగింది. టీడీపీ నుండి గెలిచి వైసీపీ వైపుకు వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, నారా లోకేష్ లను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎలిమినేటి మాధవరెడ్డి పేరును ప్రస్తావించారు. తాజాగా నిన్న అసెంబ్లీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. ఎలిమినేటి మాధవరరెడ్డి పేరును ఉశ్చరిస్తూ విమర్శలకు దిగారు. మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు తదితర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును అవమానిస్తూ మాట్లాడారు. దీంతో మనస్థాపానికి గురైన చంద్రబాబు సభ నుండి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననం జరిగేలా వ్యాఖ్యలు చేయడాన్ని సభ్య సమాజం తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో ఎలిమినేటి మాధవరెడ్డికి సంబంధించిన వివరాలు ఏమిటంటే…

Who is the Alimineti madhava reddy
Who is the Alimineti madhava reddy

 

Alimineti madhava reddy: ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో హోం మంత్రిగా..

టీడీపీ ఆవిర్భావానికి ముందు మాధవరెడ్డి గ్రామ రాజకీయాల్లో ఉండేవారు. 1984లో ఆయన టీడీపీలో చేరారు. 1983లో నారా లోకేష్ పుట్టిన ఏడాది తరువాత మాధవరెడ్డి పార్టీలో చేరారు. 1985 లో టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా ఎన్నికైన మాధవరెడ్డి.. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మాధవరెడ్డి మృధు స్వభావి అయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతల నియంత్రించడానికి సమర్ధవంతంగా చర్యలు తీసుకున్నారు. ఈ తరుణంలో నక్సల్స్ కు మాధవరెడ్డి శతృవు అయ్యాయి. 2000 సంవత్సరంలో పీపుల్స్ వార్ గ్రూపు నక్సలైట్ లు పేల్చిన మందు పాతర కారణంగా మాధవరెడ్డి మృతి చెందారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నియంత్రలో పటిష్ట చర్యలు చేపట్టి ప్రాణాలు అర్పించిన నాయకుడి మరణాన్ని ఇప్పుడు రాజకీయాలకు వాడుకుంటున్నారు.

 

 

మాధవరెడ్డి మరణానంతరం ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డిని చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకువచ్చి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం 2017లో ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్ లో చేరక ముందు వరకూ టీడీపీలో పలు పదవుల్లో ఆమె ఉన్నారు. టీడీపీని వీడిన తరువాత కూడా ఆమె టీడీపీపైన గానీ, చంద్రబాబుపైన గానీ తనకు అత్యంత గౌరవం ఉందని పలు సందర్భాల్లో తెలిపారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N