Pushpa: టాలీవుడ్ ఇండస్ట్రీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కి సోషల్ మీడియాలో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ కి సంబంధించి ఎటువంటి వార్త వచ్చినా గానీ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక ఇదే క్రమంలో బన్నీ సినిమాలు వాటికి సంబంధించిన టీజర్ లు, పాటలు.. వీడియోలు అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. గతంలో త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో బన్నీ నటించిన అలా వైకుంఠపురంలో(Ala Vaikuntapuramlo) సినిమాకి సంబంధించిన పాటలు అయితే.. దక్షిణాది సినిమా రంగంలోనే ఏ సినిమా చేయని రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్(Sukumar) దర్శకత్వంలో “పుష్ప”(Pushpa) అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెలలోనే విడుదల కానున్న “పుష్ప” కి సంబంధించి ఇటీవల సినిమా ట్రైలర్.. సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 15.19 మిలియన్ వ్యూస్ సంపాదించుకుని ఆల్ టైం టాప్ 3లో నిలిచింది. 893కే లైక్స్ రాబట్టుకుని ఆల్ టైం టాప్ 2లో నిలిచి మరోసారి సోషల్ మీడియాలో.. అల్లు అర్జున్ తనకు తిరుగులేదని నిరూపించు కోవడం జరిగింది.
ఇంకా కూడా టైలర్ ని అభిమానులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని రీతిలో సినిమాలో బన్నీ ఫుల్ మాస్ లుక్ లో ఉండటంతో.. అభిమానులు సినిమా రిలీజ్ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. దాదాపు అన్ని సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు.. కావస్తూ ఉండటంతో… పుష్ప సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ చివరి సినిమా రంగస్థలం హిట్ కావడం.. బన్నీ లాస్ట్ రిలీజ్ సినిమా అలా వైకుంఠపురం లో.. బ్లాక్ బస్టర్ కావడంతో ఇద్దరూ.. కలసి మూడోసారి చేయడంతో పుష్ప పాన్ ఇండియా సినిమా కావడంతో.. సామాన్య సినీ లవర్స్ కి కూడా ఈ సినిమా పై ఇంట్రెస్ట్ నెలకొంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!