NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఆ అంశంలో జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్ధించిన ఏపి హైకోర్టు..!!

AP High Court: ఆంధ్రప్రదేశ్ ‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతోందనీ, ఏపి హైకోర్టు జగన్ సర్కార్ కు వ్యతిరేకం అంటూ ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ రెండున్నర సంవత్సరాల్లో అనేక విషయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా కూడా హైకోర్టు తీర్పులు వచ్చాయి. అయితే ఇవి మీడియాలో హైలెట్ కావడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే తీర్పులు మాత్రమే మీడియాలో హైలెట్ అవుతుంటాయి. దీంతో ఏపి న్యాయ వ్యవస్థపై అపవాదులు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇటీవల రిటైర్డ్ న్యాయమూర్తి, జై భీమ్ ఫేమ్ జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. దీనిపైనా ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా మరో న్యాయమూర్తి స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవానికి  చట్టపరిధిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టే అవకాశం ఉండదు. మెరిట్స్ ఆధారంగా హైకోర్టు తీర్పులు, వ్యాఖ్యలు ఉంటాయనేది మరో సారి రుజువు అయ్యింది.

AP High Court key comments on waqf tribunal
AP High Court key comments on waqf tribunal

 

AP High Court: ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం

రాష్ట్ర ప్రభుత్వం వక్ప్ ట్రిబ్యునల్ ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు గత నెల 25వ తేదీన జీవో నెం.16ను జారీ చేసింది. అయితే ఈ జివోను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన మహమ్మద్ ఫరూక్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమర్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ ధర్మాసనం విచారణ జరిపింది. జీవో నెం.16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేదం లేదని తేల్చి చెప్పింది. ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.

 

కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటి..?

ప్రభుత్వం నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాధమిక హక్కులకు భంగం కలగవని పేర్కొంది. విశాఖపట్నం, అనంతపురం నుండి హైకోర్టుకు వస్తున్నారనీ, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్ ను ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్‌ ఏర్పాటు వల్ల పిటిషనర్‌ కు వచ్చిన నష్టం ఏమిటని కూడా ధర్మాసనం  ప్రశ్నించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటునకు దారి తీసిన కారణంతో చిన్న అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి మూడవ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది ప్రసాదబాబు వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలు వినిపించారు.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !