NewsOrbit
న్యూస్

janaki kalaganaledu: జానకి పని అవుట్… జ్ఞానంబకి నిజం తెలిసే మల్లికను భోజనం. వడ్డించమందా..?

janaki kalaganaledu:అందరిని ఎంతగానో అలరించే జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏమి జరిగితుందో ఇప్పుడు చూద్దాం. జానకికి అకాడమీలో నిర్వహించిన పరీక్షలో సెకండ్ ర్యాంక్ రావడంతో ఆ విషయాన్ని చెప్పడానికి జ్ఞానంబ ఇంటికి వస్తాడు అభి.తనకి సెకండ్ ర్యాంక్ రావడంతో జానకి ఆనందానికి అవధులు లేవు. జానకికి ర్యాంక్ రావడంతో రామా కూడా చాలా ఆనందపడతాడు. జానకికి అభినందనలు చెబుతూ ప్రేమగా జానకి మీద ముద్దుల వర్షం కురిపిస్తాడు.ఆ తర్వాత జానకి కూడా రామాకు ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఆ సీన్ అంతా వాళ్ళిద్దరి ముద్దు ముచ్చటలతో, బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో ఉంటుంది.ఇలా తనకు అకాడమిలో సెకండ్ ర్యాంక్ రావడం వల్ల ఫీజులో రాయితీ కూడా ఇస్తారని సంతోషంలో ఉంటుంది జానకి.

janaki kalaganaledu: జానకిని కాదని మల్లికను భోజనం వడ్డించమన్నా జ్ఞానంబ :

ఇక సీన్ కట్ చేస్తే జ్ఞానాంబ, గోవిందరాజు ఇద్దరూ కలిసి అన్నం తింటూ ఉంటారు. ఈలోపు జానకి వచ్చి వాళ్లకి వడ్డిస్తూ ఉంటుంది జానకి.ఉన్నటుండి మధ్యలో జ్ఞానంబ నువ్వు ఆగు జానకి…మల్లికను పిలువు. ఈరోజు తను వడ్డిస్తుంది అని అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకు అత్తయ్య గారు!నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది జానకి.నువ్వేం తప్పు చేయలేదు కానీ.. వెళ్లి ముందు మల్లికను పిలువు అంటుంది. దీంతో మల్లికను తీసుకొని వస్తుంది జానకి. మల్లిక వచ్చి ఏంటి అత్తయ్య గారు పిలిచారంట అని అడుగుతుంది.మల్లికను చుసిన జ్ఞానంబ వచ్చి మా ఇద్దరికి భోజనం వడ్డించు అని అంటుంది.

జానకిని పొగడ్తలతో ముంచేసిన మల్లిక…మల్లిక మాటలు నిజమేనంటారా…?

అదేంటి..అత్తయ్యగారు రోజూ మీ ముద్దుల కోడలే కదా వడ్డించేది అని అంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ ఆశ్చర్యపోయి ఏం.. నువ్వు వడ్డించవా ఏంటి అంటే అప్పుడు భోజనం వడ్డిస్తూ మల్లిక కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుంది.ఈలోపు జ్ఞానంబ మల్లికను ఎందుకు నీకు, జానకికి పడదు, తను అంటే నీకు ఎందుకు అంత కోపం అని అడుగుతుంది.దీంతో మల్లిక మళ్ళీ ఓవర్ యాక్షన్ మొదలుపెట్టి అయ్యో అత్తయ్యగారు తను నాకు తోటి కోడలే కానీ.. నాకు తోబుట్టువు లాంటిది.జానకి అంటే నాకు ఎందుకు కోపం అంటూ కప్పిపుచ్చుతుంది మల్లిక.జానకి చాలా మంచిది.తనకి అబద్ధాలు ఆడడం,మోసం చేయడం లాంటివి తెలియదు. తన అన్న యోగి కూడా అంతే.చాలా మంచివాడు, అలాగే అబద్ధాలు కూడా చెప్పడు అంటుండగా ఈలోపు రామా వస్తాడు.

మల్లిక మోసం బట్టబయలు :

ఏంటి మల్లిక..నువ్వు మోసం గురించి మాట్లాడుతున్నావా అని,అసలు నువ్వు చేసిన మోసం గురించి చెబితే అని అనేలోపే జానకి రామాకి సైగ చేసి వద్దని చెబుతుంది. ఈలోపు మల్లికకు డౌట్ వచ్చి,ఏంటి మోసం అని అడుగుతారు అంటుంది. ఇంతలో సీన్ లోకి విష్ణు ఎంటర్ అయ్యి వచ్చి నేను చెబుతాను అని, మల్లిక అమ్మ బట్టలు ఉతకను అని పక్కన పెట్టేసింది అని చెబుతాడు విష్ణు. ఇక అక్కడే వున్న గోవిందరాజు అందుకుని ఇంత పని చేస్తావా అని మల్లికకు శిక్ష విధిస్తాడు.

పమావయ్యగారి తీర్పును మల్లిక గౌరవిస్తుందా?

రోజూ నువ్వు మీ అత్తయ్య బట్టలతో పాటు నా బట్టలు కూడా ఉతకాలి అని ఆర్డర్ వేస్తాడు.దీంతో మల్లికకు తెగ కోపం వస్తుంది. పెదరాయిడు స్టైల్ లో గోవింద రాజు మల్లికకు శిక్ష విధించడంతో అందరూ షాక్ అవ్వడం పక్కనపెడితే అక్కడ ఉన్న రామా, జానకి, జ్ఞానాంబలు నవ్వు ఆపుకోలేకపోతారు. మరి మామయ్యగారి ఆదేశాన్ని మల్లిక పాటిస్తుందా లేదా అనేది తరువాయిభాగంలో తెలుస్తుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N