NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan Delhi Tour: జగన్‌కు ఢిల్లీలో ఒకరిద్దరు కాదు ఆరుగురు కేంద్ర మంత్రులు చెప్పిన గుడ్ న్యూస్ ఇదే..? ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్..!!

CM YS Jagan Delhi Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సారి సీఎం జగన్ ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్ కిందే చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి మోడీతో సహా ఆరుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై వినతి పత్రాలను అందించారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు జగన్. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

CM YS Jagan Delhi Tour
CM YS Jagan Delhi Tour

 

Read More: TDP: టీడీపీకి జేసి బ్రదర్స్ రాజీనామా..?

CM YS Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో భేటీలు

అనంతరం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో సమావేశమయ్యారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, రుణ పరిమితి పెంపు తదితర అంశాలను జగన్ ప్రస్తావించారు. తదుపరి విమానయాన మంత్రి జ్యోతి రాదిత్య సింథియా భేటీలో..విశాఖ అభివృద్ధికి భోగాపురం కీలకమనీ, గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాగా ఈ రోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైయ్యారు. విశాఖలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆరు లైన్ల రహదారిని మంజూరు చేయాలని కోరారు. విశాఖ పోర్టు నుండి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. అదే విధంగా విజయవాడ తూర్పు బైపాస్ పై గతంలో చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని మంత్రిని కోరిన జగన్..భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

అనంతరం కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో జగన్ భేటీ అయ్యారు. ఏపిలో క్రీడా మైదానాల అభివృద్ధి సహా పలు అంశాలపై సీఎం జగన్ చర్చించారు. తదుపరి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమై పలు విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించి సహకరించాలని కోరనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని అంటున్నారు.

 

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N