NewsOrbit
న్యూస్ సినిమా

RRR: మార్చ్ 25 కరెక్ట్ డేట్ కాదా..అంటే మళ్ళీ వాయిదానా..?

RRR: ఎట్టకేలకి పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సైంది. అయితే, ఇది కాస్త షాకింగ్ విషయం అని చెప్పాలి. ఎందుకంటే జనవరి 7వ తేదీన రావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడి మార్చ్ 18 లేదా ఏప్రిల్ 25వ తేదీన వస్తామని అభిమానులను కన్‌ఫ్యూజన్‌లో పడేస్తూ రెండు తేదీలను ప్రకటించారు రాజమౌళి బృందం. దాంతో ఈ రెండిట్లో ఆర్ఆర్ఆర్ ఏ తేదీన వస్తుందో అని అందరూ మళ్ళీ ఆసక్తిగా చర్చించుకున్నారు. ఇంతలోనే మేకర్స్ ఆ రెండు తేదీలను కాదని మార్చ్ 25వ తేదీన ఆర్ఆర్ఆర్ ముందు అనుకున్నట్టుగానే 14 భాషలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

will rrr-release on march 25th or will it postpone again...?
will rrr-release on march 25th or will it postpone again…?

ఈ తేదీ కన్‌ఫర్మ్ చేశాక టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులలో అభిమానుల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. మార్చ్ 25న ఈ పాన్ ఇండియన్ సినిమా వస్తే నిర్మాతకు నష్టమా..లాభమా అని. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా ఎంత త్వరగా వచ్చేస్తే నిర్మాత అంత సేఫ్‌గా బయటపడతాడు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు రెండేళ్ళకి పైగా విడుదల వాయిదా పడింది. ఎంత పెద్ద నిర్మాత అయినా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాను నిర్మించాలంటే ఖచ్చితంగా ఫైనాన్షియర్స్ వద్ద భారీ మొత్తాన్ని వడ్డికి తెచ్చుకోవాల్సిందే. అయితే, కరోనా లాంటి పరిస్థితులను ఏ ఒక్కరు ముందుగానే బేరీజు వేయలేరు.

RRR: ఇలాంటి పరిస్థితిని ఊహించుకోవడమే చాలా కష్టం.

అదే ఇప్పుడు దానయ్యను చాలా వరకు కలవర పెడుతున్న విషయం. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీవ్రంగా ఒత్తిడి ఉంది. ఇలాంటి సమయంలో వారం రోజులు ఆలస్యం అయినా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకు పెద్ద సమస్యే. అందుకే మార్చ్ 25న రావడం చాలా ఉత్తమం అంటున్నారు. మళ్ళీ ఏప్రిల్ 28 అంటే ఎంత కాదన్నా నెల రోజులు గడవాలి. ఇలాంటి పరిస్థితిని ఊహించుకోవడమే చాలా కష్టం. అందుకే ఏప్రిల్ 28 ఫిక్స్ చేయకుండా రాజమౌళి బృందం మార్చ్ 25 ఫిక్స్ చేసి చాలా వరకు మంచి స్టెప్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలలో అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాను దాదాపు 450 నుంచి 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri