NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఉద్యోగులను మునగ చెట్టు ఎక్కించేశారుగా..! సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

CM YS Jagan: ఉద్యోగులు మునగ చెట్టు ఎక్కేలా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ సహా పలు సమస్యలపై ఉద్యోగ సంఘాలు సంఘటితంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరపడం, ప్రభుత్వం ఉద్యోగ సంఘాల డిమాండ్ లపై పలు సవరణలకు అంగీకారం తెలుపడంతో ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు. పీఆర్సీ మినహా ఇతర సమస్యలపై ప్రభుత్వం నుండి సానుకూల పరిష్కారాలు లభించడంతో ఆదివారం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM YS Jagan key comments on employees issue
CM YS Jagan key comments on employees issue

 

Read more: APTF: ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఏపీటీఎఫ్.. వారి వైఖరిపై సజ్జల సంచలన కామెంట్స్..

CM YS Jagan: మీరు లేకపోతే నేను లేను

ఉద్యోగుల సహకారం ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయగలుగుతుందని సీఎం వైఎస్ జగన్అన్నారు. కోవిడ్, ఆర్ధిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు చేయగలిగినంత చేశామని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరూ భావోద్వేగానికి పోవద్దని అన్నారు. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. “నేను మనస్పూర్తిగా నమ్మెది ఒక్కటే..మీరు లేకపోతే నేను లేను” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే కమిటీ ఉందనీ, వారితో ఉద్యోగ సంఘాలు చర్చించవచ్చని చెప్పారు. మంత్రుల కమిటీ కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు. ఎవరికీ అన్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి ఉండదని జగన్ అన్నారు.

కలిసికట్టుగా పని చేసి అభివృద్ధి ఫలాలను అందరికీ అందిద్దాం

30వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అందరం కలిసికట్టుగా పని చేసి అభివృద్ధి ఫలాలను అందరికీ అందిద్దామని అన్నారు. ఎవరూ చేయనిది జగన్ చేశాడు అని అనుకోవాలంటే సీపీఎస్ రద్దు చేయడమేననీ, దానిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తామని జగన్ చెప్పారు. అందరినీ భాగస్వాములను చేసి దానిపై అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంలో రోస్టర్ పద్దతి ప్రకారం చర్యలు చేపడతామనీ, దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని జగన్ వివరించారు.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?