NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

APTF: ఏపి జేఏసీకి షాక్ ఇస్తూ ఏపీటీఎఫ్ కీలక నిర్ణయం..జేఏసీ పదవులకు రాజీనామా

APTF leaders walks out from employees jac

APTF: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆశలు వమ్ము చేసేలా ఏపి జేఏసీ నాయకత్వం అప్రజాస్వామిక మోసపూరిత వైఖరి అవలంబించిందని ఆరోపిస్తూ ఏపీటీఏఫ్ (ఉపాధ్యాయ సంఘం) నేతలు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఏపి జేఏసీ కో చైర్మన్ పదవి, కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఏపీటీఏఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే భానుమూర్తి, పి పాండురంగ వరప్రసాదరావులు ప్రకటించారు. ఈ మేరకు వీరు ఏపిజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావుకు లేఖ రాశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పీఆర్సీ ఉద్యోగులకు ఇప్పించడంలో విఫలం అయినందున ఏపి జేఏసీ ఆధ్వర్యంలో తొలుత రెండు జేఏసిల కలయిక, ఆ తరువాత నాలుగు జేఏసిల కలయిక ఉద్యోగుల్లో గొప్ప ఆశలు రేకెత్తించాయన్నారు.

APTF leaders walks out from employees jac
APTF leaders walks out from employees jac

APTF: ఎలాంటి ఫలితాలు రాకుండానే

జేఏసీ ఏర్పడిన నాటి నుండి ఏపీటిఎఫ్ జేఏసీలో భాగస్వామిగా ఉందన్నారు. స్టీరింగ్ కమిటీలో ఏపీటీఎఫ్ కు చోటు ఇవ్వకపోయినా ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా జేఏసిలో కొనసాగామన్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో నాయకత్వం ప్రదర్శించిన తీరు, ఎలాంటి ఫలితాలు రాకుండానే ఉద్యమాన్ని విరమించడం, ఈ ఉద్యమ కాలంలో నాయకత్వం ప్రభుత్వాన్ని విమర్శించిన మాటలకు ఆవేదన వ్యక్తం చేయడం వంటి చర్యలను వీరు తీవ్రంగా ఖండించారు.

 

జన బలం ఉన్న నాయకత్వం ప్రభుత్వానికి ఉద్యమాన్ని తాకట్టు పెట్టినట్లుగా భావిస్తున్నామన్నారు. ఉద్యోగుల డిమాండ్లు ఏవీ పరిష్కారం కాకుండానే సమ్మె విరమణకు నిర్ణయం తీసుకోవడం గానీ సమ్మె విరమణ ప్రకటన చేసే ముందు ఏపి జేేేఏసీలోని భాగస్వామ్య సంఘాలతో కనీసం చర్చించలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులమైన తాము జేఏసీలో కో చైర్మన్ గా, కార్యవర్గ సభ్యులుగా కొనసాగడంలో ఎలాంటి అర్ధం లేదని కావున తమ పదవులకు రాజీనామా చేస్తూ, భవిష్యత్తు ఉద్యమాల కోసం జేఏసిలో కొనసాగుతామని తెలియజేశారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju