NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu: బాబుకి మైండ్ మొత్తం ఆ ఒక్కటే తిరుగుతుందట..! పాపం కదా…!?

Chandrababu: ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రభుత్వంపై ఎప్పుడూ విమర్శలు చేయడమే కాదు.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి.. తదనుగుణంగా ప్రజల్లో గెలవాలి.. గెలిచి నిలవాలి. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ఈ పద్ధతుల్ని ఎంతగా పాటిస్తోందనేదే ప్రశ్నగా మారింది. 2019లో ఓటమి అనంతరం పార్టీ బాగా కుంగిపోయింది. గెలిచిన 23 మందిలో కొందరు పార్టీ మారిపోయారు. మరికొందరు అవకాశం కోసం చూస్తున్నారు. ఇంకొందరు పార్టీలో ఉన్నారో లేరో పార్టీకే తెలీదు.. ఈ పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టడం చంద్రబాబుకు సవాల్ గానే మారింది. సమస్య కనపడితే ప్రభుత్వాన్ని విమర్శించడమే కానీ.. ప్రజల్లోకి వెళ్తున్నది తక్కువే అని చెప్పాలి. ఊపిరి సలపని సీఎం జగన్ వ్యూహాలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ బలపడటం అనే మాటే మరచిపోయింది.

chandrababu plans for tdp development
chandrababu plans for tdp development

యువశక్తి కావాలి..

మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి. పార్టీలో కొత్త నాయకత్వం రావాలి. కానీ.. టీడీపీలో ఆ పరిస్థితే కనిపించడం లేదన్నది కొందరి మాట. చంద్రబాబు ప్రతిసారీ పార్టీలో యువ రక్తాన్ని నింపుతామంటారు. కానీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే ఈ మాట అధికారంలోకి వస్తే మాత్రం మరచిపోతారనే అపవాదు మూటగట్టుకున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఉద్యమాలు చేస్తున్నారు కానీ.. సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు లేవని చెప్పాలి. అమరావతి ఉద్యమంలో రైతులు పోరాడుతున్నారు. రాజధాని కోసం అధికారంలో ఉన్నప్పుడు భూములు సేకరించిన టీడీపీ ఇప్పుడు.. రైతుల ఉద్యమంలో 500, 1000 రోజులు సందర్భంగానో.. ఏడాది, రెండేళ్లయిన సందర్భంగానో మాత్రమే స్పందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మార్చలేకపోయిందనేది వాస్తవం.

లోకేశ్ మెప్పించాలి..

భవిష్యత్ నాయకత్వంపై కూడా ఆ పార్టీలోనే కాదు.. ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందనే చెప్పాలి. పార్టీలో లోకేశ్ హవా పెంచుకోవట్లేదనే విమర్శ కూడా ఉంది. యువ నాయకుడిగా ప్రజల్లో నిలిచింది తక్కువే అనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఎప్పుడో ఓసారి కనిపించినా తన హవా చాటేవారు. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందు నుంచీ పాదయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల మధ్యే ఉన్నారు. ఆ ఎఫెక్ట్ స్థాయి ఏంటో 2019లో వైసీపీకి దక్కిన భారీ విజయమే చాటి చెప్పింది. లోకేశ్ నుంచి ఇదే తరహా ఇంపాక్ట్ కోసం పార్టీ శ్రేణులు చూస్తాయనడంలో సందేహం లేదు. మరి.. రాబోయే రోజుల్లో టీడీపీ అడుగులు ఎలా ఉంటాయో.. వేచి చూడాల్సిందే..!

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju