Ravi Teja : ఫిబ్రవరి 11న మాస్ మహారాజా రవితేజ ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా కలెక్షన్ల కంటే రవితేజ పై ఒక డైరెక్టర్ భార్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఖిలాడి మూవీ డైరెక్టర్ రమేష్ వర్మ భార్య పేరు రేఖా వర్మ (Rekha Varma). తాజాగా ఈమె రవితేజ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Ravi Teja : రవితేజ పై డైరెక్టర్ భార్య వ్యాఖ్యలు
రవితేజది ఒక చీప్ క్యారెక్టర్ అనే మీనింగ్ వచ్చేలా రమేష్ వర్మ (Ramesh Varma) భార్య రేఖా వర్మ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. నిజానికి గతంలో అజయ్ భూపతి అని డైరెక్టర్ రవితేజను ఉద్దేశించి అతనిది ఒక చీప్ క్యారెక్టర్ అని అన్నాడు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అజయ్ భూపతి రవితేజది చీప్ క్యారెక్టర్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు నాకు బాగా అవగతమవుతోంది అంటూ ఆమె కామెంట్లు చేసింది. అయితే ఆమె ఇలా అనడానికి కారణం ఏంటో ఇంకా తెలియ రాలేదు. ఇటీవలే జరిగిన ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాక… రవితేజ, రమేష్ వర్మల మధ్య చిన్నపాటి వివాదం జరిగిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు రమేష్ వర్మ భార్య పెట్టిన పోస్టు వీరి మధ్య గొడవ జరిగిందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఖిలాడి మూవీ
మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ (Dimple Hayathi) హీరోయిన్లుగా నటించిన ఖిలాడి మూవీని హవీష్ ప్రొడక్షన్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో యాంకర్ అనసూయ, అర్జున్ సర్జా వంటి నటీ నటులు నటించారు.