NewsOrbit
న్యూస్ సినిమా

Allu arjun: ఇప్పటికే రెండుసార్లు పెద్దపొరపాటు చేసిన అల్లు అర్జున్..మళ్ళీ చేస్తాడా.?

Allu arjun: మన సినీ తారలు స్టార్ హోదా వచ్చాక పలు కమర్షియల్ యాడ్ ఫిలింస్ చేసేందుకు ఒప్పు కుంటారు. భారీ రెమ్యునరేషన్ వస్తుందనేది ఒక కారణం అయితే, ఇంటర్‌నేషనల్ రేంజ్‌లో పాపులారిటీ వస్తుందని పలు కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు సినిమాల ద్వారా పాపులారిటీ సాధించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నేషనల్ యాడ్స్ ద్వారా బాగా సంపాదిస్తున్నారు. అయితే, కొన్నిసార్లు ఈ యాడ్స్ వల్ల స్టార్ హీరోలే చిక్కుల్లో పడుతున్నారు. అభిమానుల నుంచే ట్రోల్స్‌కు తీవ్రంగా గురౌవుతున్నారు. ఏకంగా పోలీసు కేసు కూడా ఫైల్ అవుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఇలాంటి ట్రోల్స్ విస్తృతమయ్యాయి. అందుకు కారణం ఆయన చేసిన రెండు కమర్షియల్ యాడ్స్.

will allu-arjun-repeats the same mistake
will allu-arjun-repeats the same mistake

రీసెంట్‌గా అల్లు అర్జున్ జొమాటో బ్రాండ్ అంబాసిడర్‌గా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ నటుడు సుబ్బరాజుతో కలిసి అల్లు అర్జున్ షూట్ చేసిన కమర్షియల్ యాడ్ ఇప్పుడు ప్రసారం అవుతోంది. అలాగే నెట్టింట కూడా బాగా వైరల్ అయింది. ‘సౌత్ సినిమా కదా.. ఎక్కువ సేపు ఎగరాలి’ అని అల్లు అర్జున్ చెప్పిన ఓ డైలాగ్ మీద సౌత్ ఇండియా సినిమా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలను తీవ్రంగా కించపరిచారంటూ, అభిమానులు.. నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. అలాగే, సౌత్ సినిమాను అవమానించారని కూడా అల్లు అర్జున్‌ను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు.

Allu arjun: మూడవసారి అది రిపీట్ కాకుండా చేసుకుంటాడా..?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ భాగమైన మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోగా విపరీతమైన పాపులారిటీ సాధించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ డైలాగ్ ఎలా చెప్పగలిగారని కొందరు నెటిజన్స్ ఫైర్ అయ్యారు. అంతే కాదు దాంతో ఈ యాడ్ విషయంలో జొమాటో సంస్థ వెనక్కి తగ్గినట్లు తాజా సమాచారం. ఇప్పుడు మీడియాలో అలాగే.. సోషల్ మీడియాలోనూ ప్రసారమవుతున్న జొమాటో యాడ్ లో సౌత్ సినిమాపై బన్నీ చేసిన కామెంట్ లేదు. సినిమాలకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేకుండా.. ప్రకటన ఎడిట్ చేశారు. గతంలో కూడా ఓ ప్రకటన విషయంలో ఇలాంటి సమస్యలనే అల్లు అర్జున్ ఎదుర్కొన్నాడు. ఇప్పటికే రెండుసార్లు బన్నీ ఈ పొరపాటు చేశాడు. మరి మూడవసారి అది రిపీట్ కాకుండా చేసుకుంటాడా లేదా చూడాలి.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri