NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP DGP: రఘురామ మరో బాణం .. డీజీపీ పోస్టింగ్ పై కేంద్రం గురి..!

AP DGP: వైసీపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు మరో బాణం ఎక్కుపెట్టారు. ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అర్ధాంతరంగా బదిలీ చేసి ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకంలో సీనియారిటీని చూడకుండా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. సహజంగా ఆ స్థానంకు అర్హత ఉన్న అధికారులు తమకు ఆ పదవి రాకపోతే తమకు అన్యాయం జరిగింది అంటూ క్యాట్ కో, కోర్టుకో వెళుతారు. గతంలో ఆ విధంగా పలువురు అధికారులు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏపిలో మాత్రం ఇలాంటి అన్యాయంపై ఎవరూ నోరు మెదపలేదు.

Rebel MP Raghurama krishnam raju complaints on AP DGP post issue
Rebel MP Raghurama krishnam raju complaints on AP DGP post issue

AP DGP:  హోంశాఖ మంత్రి, యూపీఎస్సి కు లేఖ

అయితే ఐపీఎస్ అధికారులు ఎవరూ స్పందించకపోయినా రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు దీనిపై స్పందించారు. దాదాపు 12 మంది డీజీపీ స్థాయి అధికారులను కాదనీ కింద వరుసలో ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ హోదా ఎలా ఇచ్చారంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆయన హోంశాఖ మంత్రితో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేఖ రాశారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తుంటుంది. దానికి సంబంధించి వారి నుండి తాజాగా లేఖ రావడంతో రఘురామ మళ్లీ గళం విప్పడం చర్చనీయాంశం అయ్యింది. ఉన్నత స్థాయి పోలీస్ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. తాము చేయలేని పని ఓ ఎంపి చేశారని పలువురు సీినియర్లు సంబరపడుతున్నారుట.

CM YS Jagan 1000 Days: How Many Marks..!?

యూపీఎస్సీ నుండి ప్రభుత్వానికి లేఖ..?

సీఎం జగన్ తన సొంత జిల్లా, తన సామాజికవర్గం అన్న కోణంలోనే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పోస్టింగ్ ఇచ్చారని రఘురామ కృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిబంధనల ప్రకారం ముగ్గురు పేర్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుండి గానీ, యూపీఎస్సి నుండి గానీ స్పందన రాకపోతే కోర్టును సైతం ఆశ్రయించే యోచనలో రఘురామ కృష్ణంరాజు ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరో పక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి యూపిఎస్సీ నుండి లేఖ అందినట్లు తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజు లేఖపైనే యూపీఎస్సీ స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఉండవచ్చని భావిస్తున్నారు. యూపిఎస్సీ నుండి లేఖ అందితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ముగ్గురు లేదా అయిదుగురితో కూడిన అర్హుల జాబితాను యూపిఎస్సీకి పంపించాల్సి ఉంటుంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N