NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Legislative council: చిడతలు వాయించి నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు..సస్పెండ్ చేసిన మండలి చైర్మన్ మోషేన్ రాజు

AP Legislative council: ఏపి శాసనమండలి నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. గురువారం సభ ప్రారంభమైనప్పటి నుండి టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. రాష్ట్రంలో మద్య నిషేదం అమలుపై చర్చించడంపై టీడీపీ సభ్యలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఈ సందర్భంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రోజు టీడీపీ సభ్యులు సభకు అడ్డుతగులుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క టిస్టలరీకి అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, బూమ్ బామ్ బీరు లకు ఎవరు పర్మిషన్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

AP Legislative council tdp mlcs suspension
AP Legislative council tdp mlcs suspension

 

టీడీపీ సభ్యులు చిడతలు వాయిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్ బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్, రాజనర్సింహులు ఉన్నారు.

 

మండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఈ స్థాయిలో దిగజారిపోతారని అస్సలు ఊహించలేదన్నారు. టీడీపీ సభ్యులు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారన్నారు. పెద్దల సభలో చిల్లరగా గలాభా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు బయట నుండి సభను కంట్రోల్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అనంతరం చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?