NewsOrbit
న్యూస్

Karthika Deepam: మళ్ళీ ఎన్నాళ్లకు సౌందర్య ఉగ్రరూపం దాల్చింది..? ఒక్కొక్కళకి చెమటలు పట్టించిందిగా…!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో జ్వాల తనలో ఉన్న పగ గురించి నిరుపమ్, ప్రేమ్‌లకు చెబుతూ ఉంటే ఆ మాటలు పక్కనున్న హిమ వింటుంది. దాంతో హిమకి ‘జ్వాలే సౌర్య’ అనే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే జ్వాలకు హిమ మీద ఉన్న కోపం గురించి తెలుసుకుని నేనే హిమ అనే నిజం చెప్పలేకపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో జ్వల మాటలు విని ఏడుస్తూ హిమ అక్కడ నుంచి వెళ్లబోతుంటే హిమని చూసిన జ్వాల ‘హేయ్ తింగరీ.. ఏంటి చెప్పకుండా వెళ్తున్నావ్’ అంటు అడ్డుపడుతుంది.హిమ కళ్లనిండా నీళ్లతో జ్వాల వైపు చూస్తూ.. ‘సౌర్యా ఇంకా నీ కోపం తగ్గలేదా? ఏం చేస్తే నువ్వు మారతావ్?’ అంటూ మనసులోనే అనుకుంటుంది. జ్వాల మాత్రం. అలా చూస్తూ ఉండిపోతుంది.ఏం లేదు’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది హిమ.

Karthika Deepam APR 8 Today Episode: జ్వాలనే సౌర్య అనే నిజం తెలుసుకున్న హిమ ఏమి చేయనుంది..?
Karthika Deepam: అమ్మా నాన్నల ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకున్న హిమ :

సీన్ కట్ చేస్తే హిమ ఆనందంతో పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి దీప, కార్తీక్‌ల ఫొటోల ముందు నిలబడి.. ‘అమ్మా నాన్నా నేను మన సౌర్యని చూశాను.సౌర్య ఎవరో కాదు ఆ జ్వాలే అమ్మా అని చెబుతుంది. తను మన సౌర్య అని తెలియగానే గుండెలకు హత్తుకుని ఏడ్వాలని అనిపించింది తెలుసా? కానీ నేనే హిమ అని చెప్పలేని పరిస్థితి. చిన్నప్పుడు నా మీద ఉన్న కోపం ఇప్పుడు వేయి రెట్లు పెరిగిందమ్మా. తన కోపం ఎలా పోతుంది.నన్ను ఏం చేయమంటారో చెప్పండి నా పేరు ఎత్తితేనే సౌర్య రగిలిపోతుంది అంటూ ఏడవడం మొదలు పెడుతుంది.చిన్నప్పుడు నా మీద సౌర్యకు ఎంత ప్రేమ ఉండేదో.. ఇప్పుడు ఆ ప్రేమంతా ధ్వేషంలా మారిపోయింది.అసలే తనొక హార్ట్ పేషెంట్. తనని నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను.అలాగే చిన్నప్పుడు అమ్మ వంటలు చేస్తూ కష్టపడినట్లుగానే.. ఇప్పుడు సౌర్య కూడా ఆటో నడుపుతూ కష్టపడుతోంది డాడీ అంటుంది.సౌర్యకి నా మీద ఉన్న కోపాన్ని ప్రేమగా మార్చుకునేలా నన్ను దీవించండి..’ అంటూ దీప కార్తీక్‌ల ఫొటోల ముందు ఏడ్చి ఏడ్చి అక్కడ నుంచి వెళ్తుంది హిమ.

Karthika Deepam APR 7 Today Episode: నిరూపమ్ జ్వాల మాయలో పడిపోయాడుగా..! పాపం హిమ పరిస్థితి ఏంటో.. ?
సౌందర్య విశ్వరూపం మాములుగా లేదుగా?

సీన్ కట్ చేస్తే.. స్వప్న ఇంటి దగ్గర ఉన్న ఆనందరావుని కలవడానికి గేట్ దగ్గరకు వస్తుంది సౌందర్య. పైనుంచి సౌందర్యను చూసిన స్వప్న ఆగు అని అరుస్తుంది. సౌందర్య గేటు అవతలే ఆగిపోతుంది. ‘ఏంటండి మనకు ఈ కర్మా? కన్న కూతురు ఇంటికి వచ్చి ఇలా జైల్లో ఖైదీలు కలుసుకున్నట్లు కలుసుకోవాల్సి వస్తోంది’ అంటుంది ‘మంచి జరగాలన్నప్పుడు ఇలాంటివి తప్పవు సౌందర్యా అంటాడు.ఇంతలో స్వప్న ఆవేశంగా కిందకు వచ్చి.. ‘డాడీ నా ఇంట్లోకి వచ్చే అధికారం మీకు మాత్రమే ఉంది.ఇలాంటి వాళ్లని ఇంటికి రానివ్వద్దు అని అరుస్తుంది. దాంతో సౌందర్యకు కోపం వచ్చి మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకు తన పాతరూపాన్ని చూపిస్తుంది. కోపంతో హేయ్ ఏంటే నువ్వు ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావ్’. పంతంలో నేను కూడా నీకేం తక్కువ కాదే.. నేను నీకు అమ్మ అని గుర్తుపెట్టుకో అని సౌందర్య కోపంగా వేలు చూపిస్తూ అరుస్తుంది.డాడీ నువ్వు ఈ ఇంట్లో ఉండొచ్చు.. కానీ సందర్శకులకు మాత్రం ప్రవేశం లేదు అంటుంది.ఇంతలో నిరుపమ్ అక్కడకి వచ్చి అమ్మమ్మా ఎప్పుడు వచ్చావ్.. పదమ్మమ్మా లోపలికి’ అంటాడు ప్రేమగా. ‘నిరుపమ్.. ఈ ఇంట్లోకి ఎవరు రావాలో ఎవరు రావద్దో నాకు బాగా తెలుసు.. నువ్వు వచ్చేయ్..’ అని అరుస్తుంది స్వప్న.నిరుపమ్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా వినిపించుకోకుండా అక్కడ నుంచి లోపలికి వెళ్లిపోతుంది.

Karthika Deepam APR6 Today Episode: జ్వాలనే సౌర్య అని హిమకు తెలిసిపోయిందా..?
జ్వాల ఇంటికి వచ్చిన హిమ :

ఇక సీన్ కట్ చేస్తే జ్వాల మాత్రం ఇంట్లో కూర్చుని హిమని తలుచుకుంటు ‘ఇదేంటి నాకు ఆ తింగరే గుర్తొస్తుంది? అనుకుంటుంది.ఇక అప్పుడే హిమ పళ్లు తీసుకుని జ్వాల ఇంటికి వస్తుంది. జ్వాల బయటికి వెళ్లి హిమని చూసి షాక్ అయ్యి ‘ఏంటి తింగరీ..? చీకట్లో ఎలా వచ్చావ్. మా ఇళ్లు ఎలా తెలిసింది అంటూ మాట కలుపుతుంది. అప్పుడే హిమ బయటకు వస్తున్న చంద్రమ్మ, ఇంద్రుడులను చూసి గుర్తుపడుతుంది. హిమకు చిన్నప్పుడు చీక్ మంగుళూరులో తనని కాపాడింది వీళ్ళే కదా అని గుర్తు వస్తుంది.అంటే సౌర్య.. పిన్నీ బాబాయ్‌ల దగ్గరే ఉంటుందా.. దేవుడా ఎలాగయితేనే సౌర్యను మంచి మనుషుల దగ్గరకే చేర్చావ్ అనుకుంటుంది మనసులో హిమ.

హిమ తన అసలు పేరు జ్వాలకు చెబుతుందా..?

అందరూ కలిసి లోపలికి వెళ్తారు చంద్రమ్మ, ఇంద్రుడు కూడా హిమతో ప్రేమగా మాట్లాడతారు. హిమ డాక్టర్ అని తెలుసుకుంటారు. జ్వాల మాత్రం హిమని తింగరీ తింగరీ అని పిలుస్తుంటే..‘అదేం పేరమ్మా అలా అంటావ్ తనకంటూ ఓ పేరుంటుంది కదా? నీ పేరేంటమ్మా’ అంటుంది చంద్రమ్మ. ఆ మాటకు హిమ ఏమి చెప్పాలో తెలియక తటపటాయిస్తుంది. ఇంతలో సౌర్య ‘వద్దు వద్దు.. నీ పేరు చెప్పకు.. నేను మళ్లీ ముద్దుగా తింగరీ అని పిలవలేను కదా వద్దులే అంటుంది.దాంతో హిమ మనసులో హమ్మయ్య అనుకుంటుంది.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju