NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan Cabinet: జగన్ టీంలో ఫుల్ టెన్షన్ .. కొందరి సీరియస్ కండీషన్..!?

YS Jagan Cabinet: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ మార్పులు చేర్పులకు సంబంధించి అనేక కరసత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహనరెడ్డి ఊహించని ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. గడ్స్ ఉన్న నేతగా, హామీ ఇస్తే మాట తప్పరు, వెనుకడుగు వేయరు అన్న పేరు ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డే నేడు కొన్ని విషయాల్లో వెనుకడుగు వేసి కొంత మంది కండిషన్ లకు తలొగ్గాల్సి వస్తోంది. మంత్రివర్గ మార్పుల్లో భాగంగా నలుగురిని మాత్రమే పాత వాళ్లకు తీసుకుంటారు. మిగిలిన వాళ్లు అందరూ కొత్త వాళ్లు వస్తారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు నలుగురు కాస్త ఆరుగురికి వచ్చి ఆరుగురి నుండి పది మందికి అయ్యింది. ఈ రోజు మధ్యాహ్నానికి లిస్ట్ ఫైనల్ చేసి రేపు గవర్నర్ కు పంపుతామన్నారు. కానీ ఇంత వరకూ లిస్ట్ ఫైనల్ కాలేదు. రేపు మధ్యాహ్నానికి లిస్ట్ ఫైనల్ అవుతుంది అని అంటున్నారు.

YCP Leaders tension on YS Jagan Cabinet news list
YCP Leaders tension on YS Jagan Cabinet news list

YS Jagan Cabinet: ముందుగా పెద్దిరెడ్డి, బాలినేని ఇద్దరినీ తొలగించి..

ఉదాహారణకు ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కొనసాగించకుండా అదే జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొనసాగించాలని తొలుత భావించారు జగన్. ఇక్కడ అనేక ఈక్వేషన్లు ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత. రెడ్డి సామాజికవర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగించాలని నిర్ణయించారు. ముందుగా పెద్దిరెడ్డి, బాలినేని ఇద్దరినీ తొలగించి ఆర్కే రోజాతో పాటు మరొకరిని అదే సామాజికవర్గం వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని జగన్ భావించారు. పెద్దిరెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన నుండి అసంతృప్తి, అసమ్మతి రావడంతో ఆయనను కొనసాగించాలని అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే బాలినేని వర్గం కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వయంగా బాలినేని మీడియా ముందే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీకేమైనా బాధ ఉందా అని మీడియా ప్రశ్నిస్తే బాధ ఉండదా ఏమిటి అని బాలినేని అన్నారు. తన అనుచరులతోనూ బాలినేని మీటింగ్ పెట్టారు. అదే జిల్లాకు చెందిన తనకు జూనియర్ అయిన ఎమ్మెల్యేను మంత్రివర్గంలో కొనసాగిస్తూ ఆయనను తప్పించడం పట్ల బాలినేని అవమానంగా ఫీలు అవుతున్నారుట. అయితే ఆయనకు కేబినెట్ ర్యాంక్ ఉన్న మరో పదవి ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారుట.

YS Jagan Cabinet: ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు పక్కన బెట్టి

అదే విధంగా బొత్స సత్యనారాయణ,  కన్నబాబు, పేర్ని నాని, తానేటి వనిత ఇలా చాలా మంది ఉన్నారు. సామాజిక సమీకరణలో కొంత మందిని కొనసాగించాల్సి వస్తొంది. కొందరిని ఒత్తిళ్లు, అసంతృప్తి, అసంతృప్తుల నేపథ్యంలో మరో సారి అవకాశం ఇవ్వాల్సి వస్తొంది. నిజానికి మంత్రివర్గ కూర్పు ప్రశాంత్ కిషోర్ (పీకే) ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంపై 15 రోజుల క్రితమే జగన్మోహనరెడ్డి ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఉన్న మంత్రులను పక్కన బెట్టి. వీళ్ల వీళ్లను తీసుకోవాలని లిస్ట్ ప్రెపేర్ చేసుకున్నారు. మంత్రి వర్గం నుండి తొలగించిన వాళ్లకు పార్టీ బాధ్యతలు అప్పగించాలనీ, జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ గా కేబినెట్ ర్యాంక్ తో ప్రోటోకాల్ పదవులు ఇవ్వాలని జగన్ అనుకున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు పక్కన బెట్టి తన ఆలోచనలను పక్కన బెట్టి అసంతృప్తి, అసమ్మతి, సీనియారిటీల వత్తిళ్లకు లొంగాల్సి వస్తోంది. సో.. అందుకే మంత్రి వర్గ కూర్పునకు సంబందించి కొన్ని పేర్లు వస్తున్నాయి. ఒక గంటకే ఆ పేర్లు పక్కకు వెళ్లిపోయి వేరే వాళ్ల పేర్లు వస్తున్నాయి.

కుదరని  సామాజికవర్గాల కూర్పు

ఈ రోజు ఉన్న పేర్లు రేపటి వరకూ ఉంటాయో లేదో..! మళ్లీ మారతాయో..! తెలియని పరిస్థితి. కమ్మ సామాజికవర్గం నుండి కొడాలి నానిని పక్కన బెట్టి నంబూరి శంకరరావును గానీ, అప్పయ్య చౌదరిని గానీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముందుగా అనుకున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ పేరు కూడా వినిపించింది. ఇప్పుడు వీళ్లంతా ఎందుకు సీనియర్క ప్రతిపక్షాలపై ఘాటుగా మాట్లాడగలరు అని కొడాలి నానినే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈ సామాజికవర్గం నుండి మంత్రి పదవి ఆశించిన వాళ్లు భంగపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్యవైశ్య సామాజికవర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ ను తొలగించి విజయనగరం జిల్లా కొలగట్ల వీరభద్రస్వామిని తీసుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ జిల్లా నుండి బొత్స సత్యనారాయణ ఉన్నారు. మరో వైపు రాజన్నదొరను తీసుకుంటున్నారు. జిల్లాకు ఒక మంత్రి అనుకున్నారు. సామాజికవర్గాల వారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇన్ని అనుకున్నారు కానీ ఇవేమి అవ్వడం లేదు. జిల్లాకు రెండు ఇవ్వాల్సి వస్తొంది. సామాజికవర్గాల కూర్పు కుదరడం లేదు. సీనియర్ లను పక్కన బెట్టాలంటే కుదరడం లేదు. ఇలా ఎన్నో గొడవలు, ఎన్నో ఇష్యూస్ మధ్య పేర్లు గంట గంటకు పేర్లు మారుతూ వస్తున్నాయి. అందుకే ఈ ప్రక్రియ రేపటికి వాయిదా పడింది. రేపటికి ఏమి జరుగుతుందో చూడాలి మరి.

ysrcp worrying with two leaders

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju