NewsOrbit
Featured న్యూస్

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగింది.. నిన్నటి ఎపిసోడ్ లో జ్వాల బిర్యానీ తీసుకురావడంతో అందరూ కూడా ఒకేచోట కలిసి తింటారు. ఇక నిరుపమ్, ప్రేమ్, హిమ అంతా కలిసి ‘సత్య, స్వప్నల పెళ్లి రోజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లని ఎలాగైనా కలపాల్సిందే’ అని నిర్ణయించుకుంటారు. ‘మమ్మీని నేను ఒప్పిస్తానులే’ అని నిరుపమ్ అంటాడు. ఇక సౌర్య పాత పేపర్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక దొంగ ఆటోలో డబ్బులు కొట్టేయడం చూసి సౌందర్య పట్టుకుంది.అయితే అదే సీన్‌లో.. ఆ పేపర్స్ అమ్మేవాడి దగ్గర ఆర్టిస్ట్ గీత గీసిన సౌర్య, హిమల బొమ్మలు ఉంటాయి.ఇక సౌందర్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

గీత గీసిన బొమ్మను జ్వల చూస్తుందా..?

నానమ్మను ఫాలో అయి వెళదాం అనుకునే సమయానికి సౌర్య పేపర్స్‌ అతనికి డబ్బులు ఇవ్వకపోవడంతో పేపర్స్ అమ్మేవాడు తనకి అడ్డుపడతాడు. దాంతో సౌర్య సౌందర్యని ఫాలో అవ్వలేకపోతుంది. ‘ఛా ఈ సారి మిస్ అయ్యింది’ అనుకుంటుంది.ఇక సౌర్య వెళ్లిన తర్వాత తన దగ్గరున్న సౌర్య బొమ్మని చూసి షాక్ అవుతాడు.
ఇక సీన్ కట్ చేస్తే నిరుపమ్ ఒక హోటల్‌కి తల్లి స్వప్నని పిలుస్తాడు. అక్కడ ఒక కేక్ ను చూపించి కట్ చేయమంటాడు.దాని మీద అమ్మానాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఉంటుంది. మమ్మీ ‘దీన్ని అందరి ముందు డాడీతో కలిసి కట్ చెయ్యాలి మమ్మీ అంటూ ప్రేమగా అడుగుతాడు. దాంతో స్వప్న మండిపడుతుంది.అప్పుడే గుమ్మం దగ్గర సత్య, జ్వాల రావడం చూసి కోపంతో రగిలిపోతుంది.

జ్వాల మాస్టార్ ప్లాన్ తో స్వప్న తిక్క బాగా కుదిరిందిగా:

ఇక వాళ్ల పెళ్లి రోజు ఇదే రోజు అని తెలిసి సౌర్య కావాలనే స్వప్నని రెచ్చగొడుతుంది.సత్యా సార్ మీ పెళ్లి రోజుని మా బస్తీలో చాలా ఘనంగా చేస్తాను చూస్తూ ఉండండి.. ఇది ఫిక్స్ అంటూ స్వప్నని రెచ్చగొట్టి తన ఇగో మీద దెబ్బకొడుతుంది. దాంతో స్వప్న ఆవేశంగా ‘నువ్వేంటే ఫిక్స్ చేసేది.. నేను నేను ఫిక్స్ చేస్తాను.. మా పెళ్లి రోజు నా కొడుకు చేస్తాడు.. ఇది ఇది ఫిక్స్..’ అంటుంది. స్వప్న మాటలకూ నిరూపమ్,సత్య ఇద్దరు షాక్‌ అవుతారు.ఇక స్వప్న వెళ్ళిపోయాక వావ్ రౌడీ బేబీ.. నువ్వు సూపర్.. మమ్మీని ఎలా ఒప్పించాలని నేను ఇబ్బంది పడుతుంటే భలే ఒప్పించేశావ్ అంటాడు .నువ్వూ కూడా ఫంక్షన్ కు తప్పకుండా రావాలి.. అక్కడికి వస్తే నా మనసులో మాట నీకు చెప్పాలి.. థాంక్యూ రౌడీ బేబీ..’ అంటూ చేయి ఇచ్చి సంబరపడతాడు.

తింగరే హిమ అని జ్వాలకి తెలియనుందా..?

ఇక నిరుపమ్ ఆసుపత్రికి వచ్చి.. జరిగిందంతా హిమకు చెప్పడంతో ‘సౌర్య చాలా మంచి పని చేసింది’ అని మనసులో అనుకుంటుంది. ఫంక్షన్‌కి జ్వాలని కూడా పిలిచాను హిమ అనడంతో హిమకు దిమ్మతిరిగిపోతుంది. తను ఫంక్షన్‌కి వస్తే నాన్నమ్మ, తాతయ్యలను చూస్తుంది కథ అప్పుడు నేనే హిమ అని తెలుసుకుంటుంది ఇప్పుడు ఎలా అనుకోవడంతో ఎపిసోడ్ మరింత ఆసక్తిగా మారింది

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju